Vande Bharat New Colour : రంగు మారనున్న వందే భారత్ రైళ్లు .. ఆ రంగులేంటో తెలుసా..?

వందే భారత్ రైళ్లు రంగులు మారనున్నాయా..? ప్రస్తుతం తెలుపు నీలం రంగుల కాంబినేషన్ లో ఉన్న ఈ రైళ్లు తర్వలో మరో రంగుకు మారనున్నాయా..? అంటే నిజమనని తెలుస్తోంది. అవి ఏ రంగులంటే..

Vande Bharat New Colour : రంగు మారనున్న వందే భారత్ రైళ్లు .. ఆ రంగులేంటో తెలుసా..?

Vande Bharat trains New Colour

Vande Bharat trains New Colour : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకొచ్చిన వందే భారత్ (Vande Bharat)రైళ్లను పలు రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM narendra modi)స్వయంగా ప్రారంభించారు. ఈ వందేభారత్ (Vande Bharat)రైళ్లు సెమీ హై స్పీడ్ రైళ్లుగా దూసుకుపోతున్నాయి. ఈ రైళ్లు ప్రస్తుతం తెలుపు, నీలం రంగు (White and Blue Colour,)ల్లో రూపొందాయి. కానీ ఈ రైళ్ల రంగు త్వరలో మారనుంది. తెలుపు, నీలం రంగులు మారి సరికొత్త రంగుల్లోకి మారిపోనున్నాయి. ఈ రంగుల మార్పు త్వరలోనే జరుగనుంది. ఆ దిశగా రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ రంగుల మార్పు అతి త్వరలోనే జరుగనున్నట్లుగా తెలుస్తోంది.

తెలుపు, నీలం రంగుల స్థానంలో బూడిద రంగు, నారింజ రంగులు ( Grey, Orange Colours)రానున్నాయి. రైళ్ల రాక్ లు తయారు చేస్తున్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)కొన్ని రంగుల కలయికలను ప్రయత్నించింది. ఆరెంజ్, బూడిద రంగుల కాంబినేషన్ లో వీటికి సరిపోతుందని కనుగొంది. కానీ ఈ రంగుల నిర్ణయింపు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బహుశా నారింజ-బూడిద రంగులు కన్ఫార్మ్ కానున్నట్లుగా తెలుస్తోంది.

DRDO Missile Secrets : పాక్ మహిళా గూఢాచారిణికి క్షిపణి రహస్యాలు..డీఆర్‌డీఓ శాస్త్రవేత్తపై చార్జ్ షీట్

రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ వందే భారత్ రైళ్ల తయారీ జరుగుతున్న చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF‌)ను సందర్శించనున్నారు. అనంతరం కొత్త రంగుల గురించి పరిశీలించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త కలర్‌తో కూడిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ప్రస్తుతం ఉన్న వైట్ కలర్ శుభ్రం చేయడం కాస్త కష్టంగా మారిందని అందుకే ఈ రంగుల మార్పు అని అందుకే వందేభారత్‌ రైళ్లకు రంగు మార్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. కొన్ని కలర్ కాంబినేషన్లు పరిశీలించి.. ఆరెంజ్-గ్రే కాంబినేషన్‌కు ఒకే చేసినట్లు సమాచారం. కోచ్‌లకు రెండు వైపులా ఆరెంజ్ కలర్ వేసి.. డోర్‌లకు బూడిద రంగు ఉంటుందని సమాచారం. ఏది ఏమైనా ఈ రంగుల విషయంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దేశవ్యాప్తంగా 26 వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన తర్వాత వీటికి కొత్త రంగులోకి మార్చే అకాశాలు ఉన్నాయి.