మోదీ నియోజకవర్గంలో  : ఆధార్ తాకట్టు పెడితే కిలో ఉల్లి

  • Published By: veegamteam ,Published On : December 1, 2019 / 06:08 AM IST
మోదీ నియోజకవర్గంలో  : ఆధార్ తాకట్టు పెడితే కిలో ఉల్లి

Updated On : December 1, 2019 / 6:08 AM IST

సాక్షాత్తు ప్రధానమంది నరేంద్రమోడీ నియోజవర్గం అయిన వారణాసిలో కిలో ఉల్లిపాయలు కావాలంటే ఆధార్ కార్డ్ తాకట్టు పెట్టాల్సి వస్తోంది. ఎందుకంటే కిలో ఉల్లిపాయల ధరలు అలా ఉన్నాయి మరి అంటున్నారు. 

దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ప్రజలను కంటతడి పెట్టిస్తున్నాయి. దీనిపై ఆయా రాష్ట్రాల్లో ఉల్లి అధికధరలపై ప్రతిపక్ష నాయకులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ నియోజకవర్గం అయిన వారణాసిలో ఆధార్ కార్డ్ తాకట్టు పెట్టుకుని ఉల్లిపాయలు ఇస్తున్న విచిత్రం జరుగుతోంది. వారణాసిలో కొన్ని ప్రాంతాలలో  సమాజ్‌వాదీ పార్టీ యువజన కార్యకర్తలు ఉల్లిపాయల షాపులు పెట్టారు. ఆ షాపుల్లో ఉల్లిపాయలు కొనాలంటే వారి ఆధార్ కార్డు తాకట్టు పెట్టాలి. అది కూడా కేవలం కిలో ఉల్లిపాయల్ని మాత్రమే ఇస్తున్నారు. అంతేకాదు బంగారం, వెండి వస్తువులను కూడా తాకట్టు పెట్టాలంటున్నారు. 

ఇదంతా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయటానికి. ఎందుకంటే ప్రజలు ఉల్లిపాయలు కొనాలంటే బంగారం వెండిని కూడా తాకట్టు పెడితేనే గానీ కిలో ఉల్లిపాయలు కొనలేరు అని తెలిపేందుకు నిరసనగా సమాజ్ వాదీ పార్టీ యువజన నాయకులు..కార్యకర్తలు ఇలా ఉల్లిపాయల దుకాణాలకు పెట్టి నిరసన తెలుపుతున్నారు. అంతేకాదు కిలో ఉల్లి కావాలంటే అన్నింటికీ ఆధారమైన ఆధార్ కార్డు పెట్టాలని ఉల్లి పాయలు కొనాలంటే ప్రజల పరిస్థితి ఇంత దారుణంగా ఉందని తెలియజేస్తున్నారు. అలా ఆధార్ కార్డును తాకట్టు పెట్టుకుని కిలో ఉల్లిపాయల్ని ఇస్తున్నారు. 

కాగా దేశంలో రోజురోజుకు ఉల్లిధరలు పెరిగిపోతున్నాయి. రూ. 80 నుంచి 120 వరకూ చేరుకుంటున్నాయి. సెప్టెంబరులో ఉల్లి ధరలు కిలోకు రూ. 50 నుంచి 60 వరకూ ఉండేవి. ఈ ధరలు గత సంవత్సరంతో పోలిస్తే నాలుగు రెట్లు అధికంగా ఉన్నాయి.