Viral Video : ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ షూట్.. వైద్యుడిని తొలగించిన అధికారులు
ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్‌కి క్రేజ్ మామూలుగా ఉండట్లేదు. తాజాగా ఓ డాక్టర్ చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్ అతని ఉద్యోగం పోయేలా చేసింది. ఇంతకీ అతనేం చేశాడు? చదవండి.

Viral Video
Viral Video : బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన ఒక డాక్టర్ చిక్కులు కొని తెచ్చుకున్నాడు. ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ వీడియో చేసి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. కర్నాటకలో జరిగిన ఈ సంఘటన వైరల్ అవుతోంది.
కూరగాయల మార్కెట్‌ను చూడడానికి వెళ్లి.. కాల్చి వచ్చిన పిల్లాడు.. వీడియో వైరల్
ఇటీవల కాలంలో పెళ్లి ఫోటోల కంటే ప్రీ వెడ్డింగ్ షూట్ క్రేజ్ పెరిగిపోయింది. వింత వింత కాన్సెప్ట్‌లతో పాటు ప్రాణాంతకమైన ఫీట్లతో కూడా ఈ షూట్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ క్రేజ్‌తో ఓ డాక్టర్ సైతం ఉద్యోగం పోగొట్టుకున్నాడు. చిత్రదుర్గ జిల్లాలోని భరమసాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఒక వైద్యుడు ఆపరేషన్ థియేటర్లో తన కాబోయే భార్యతో కలిసి ప్రీ వెడ్డింగ్ వీడియోలో పాల్గొన్నాడు. ఈ షూటింగ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. డాక్టర్ అతని కాబోయే భార్యతో కలిసి నకిలీ శస్త్ర చికిత్స చేస్తున్నట్లు వీడియోలో కనిపించింది. లైటింగ్ సెటప్ మధ్య వైద్య పరికరాలను పట్టుకుని ఈ జంట కనిపించింది. చుట్టూ ఉన్న కెమెరామెన్‌లు, ఇతరులు నవ్వడం కూడా వినిపించింది. బెడ్‌పై ఆపరేషన్ కోసం పడుకున్నట్లు నటించిన వ్యక్తి వీడియో చివర్లో లేచి కూర్చుని పగలబడి నవ్వుతాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వైద్యుడిని అధికారులు వెంటనే తొలగించారు.
MS Dhoni : ధోనీ తన స్వస్థలంలో దేవరీ ఆలయాన్ని సందర్శించారు.. అభిమానులు ఏం చేశారో తెలుసా? వీడియో వైరల్
గత నెల నేషనల్ హెల్త్ మిషన్ (NHM) ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్ ఆఫీసర్‌గా ఆ వైద్యుడిని నియమించారట. వీడియోలో కనిపించిన ఆపరేషన్ థియేటర్ ప్రస్తుతం నిరుపయోగంగా ఉండటంతో పాటు మరమ్మత్తులో ఉందట. ఈ విషయాన్ని చిత్రదుర్గ ఆరోగ్య అధికారి రేణు ప్రసాద్ చెప్పారు. ఇక ఈ వీడియోపై కర్నాటక ఆరోగ్యమంత్రి దినేష్ గుండూరావు స్పందించారు. ఈ ఘటనకు పాల్పడిన వైద్యుడిని తొలగించినట్లు చెప్పారు.
A doctor’s pre-wedding photoshoot in a govt hospital’s operation theatre in #Bharamasagar of #Chitradurga. Dr. Abhishek, a contract physician, performed a ‘surgery’ with his fiancee.
DHO says it was unused OT & issues notice to the administrator.#Karnataka #PreWeddingShoot pic.twitter.com/Eve0g3K9p1
— Hate Detector ? (@HateDetectors) February 9, 2024