Bihar : మద్యం సేవించిన చిరుత.. పులినన్న సంగతి మర్చిపోయి ఏం చేసిందో తెలుసా? వీడియో వైరల్

ఓ చిరుత ఫుల్లుగా మద్యం తాగింది. తను పులి అన్నసంగతి మర్చిపోయి ఏం చేసిందో తెలుసా?

Bihar : మద్యం సేవించిన చిరుత..  పులినన్న సంగతి మర్చిపోయి ఏం చేసిందో తెలుసా? వీడియో వైరల్

Bihar

Bihar : ఓ చిరుతకి అడవిలో బాగా బోర్ కొట్టేసినట్లుంది.. బయటకు వచ్చేసింది. సరాసరి మద్యం తయారు చేసే ఫ్యాక్టరీలోకి ఎంట్రీ ఇచ్చింది. కావాల్సినంత తాగింది.. ఆ తర్వాత ఏం జరిగింది? అంటే

NBK109 : బాలకృష్ణ 109వ సినిమా రిలీజ్ అప్పుడేనా..?

అడవి నుండి తప్పించుకున్న ఓ చిరుత అడ్రస్ తెలుసుకుని వచ్చినట్లు  బీహార్ లోని ఓ మద్యం తయారు చేసే ఫ్యాక్టరీకి వచ్చింది. తప్ప తాగింది. ఎంతలా అంటే అడుగు తీసి అడుగు వేయలేనంతగా. ఫుల్లుగా తాగి తూలుతూ నడుస్తూ వెళ్తుంటే ఇక జనాలు పులి వెంట పడ్డారు. మామూలు టైమ్‌లో చిరుతతో సెల్ఫీలు అంటే దానికి ఆహారం అయిపోతారు. ఎముకలు మిగులుతాయి. దొరికిందే ఛాన్స్ అన్నట్లు చిరుతతో సెల్ఫీలు, వీడియోలు దిగేసారు. దాని వెంటే నడుస్తూ అల్లరి చేసారు యువకులు. అంతా కలిసి దానిని సాగనంపుతున్నట్లు వీడియోలో కనిపించింది.

Honey Rose : బ్లూ శారీలో మైండ్ బ్లాక్ అందాలతో హనీ రోజ్..

మందు తాగితే చిందులు తొక్కేవారు ఉన్నారు..కానీ మందు తాగిన చిరుత తాను పులి అన్న సంగతి మర్చిపోయింది. జనాలు కూడా అది పులి అన్న సంగతి మర్చిపోయి నిర్భయంగా దాని వెంట పడటం ఆశ్చర్యం కలిగించింది. సోషల్ మీడియాలో ఈ చిరుత వీడియో వైరల్ అవుతోంది.