Tabla Artist Kiran Pal : ‘స్పైడర్ మ్యాన్‌’లా దుస్తులు ధరించి తబలా వాయించిన ఆర్టిస్ట్ కిరణ్ పాల్

స్పైడర్ మ్యాన్ తబలా వాయిస్తుంటే ఎలా ఉంటుంది? తబలా ఆర్టిస్ట్ కిరణ్ పాల్ పోస్ట్ చేసిన వీడియో చూస్తే తెలిసిపోతుంది. ఆర్టిస్టులు కూడా తమని తాము డిఫరెంట్‌గా ప్రమోట్ చేసుకుంటూ వైరల్ అవుతున్నారు.

Tabla Artist Kiran Pal : ‘స్పైడర్ మ్యాన్‌’లా దుస్తులు ధరించి తబలా వాయించిన ఆర్టిస్ట్ కిరణ్ పాల్

Tabla Artist Kiran Pal

Updated On : July 6, 2023 / 3:55 PM IST

Tabla Artist Kiran Pal : రొటీన్ కి భిన్నంగా ఉండటం ఇప్పుడు ప్రత్యేకత. అది సాధారణ ప్రజలైనా, సెలబ్రిటీలైనా.. జనాల్లో ప్రత్యేక గుర్తింపు కోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. రీసెంట్‌గా సంగీత విద్వాంసుడు, తబలా ఆర్టిస్ట్ కిరణ్ పాల్ స్పైడర్ మ్యాన్‌లాగ దుస్తులు ధరించి తబలా వాయిస్తున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Sarangi player : రోడ్డుపై సారంగి వాయిస్తున్న ఆర్టిస్ట్.. జానపద కళాకారుల పరిస్థితిని ప్రశ్నిస్తున్న నెటిజన్లు

స్పైడర్ మ్యాన్ తబలా వాయిస్తే ఎలా ఉంటుంది?  ఓసారి ఊహించండి. కాస్త డిఫరెంట్ గా ఉంది కదా.. అలాగే ఆలోచించారేమో తబలా ఆర్టిస్ట్ కిరణ్ పాల్ తాను స్పైడర్ మ్యాన్ లాగ డ్రెస్ చేసుకున్నారు. ఇక తబలాని వాయిస్తూ వీడియో తీసుకున్నారు. amanpaltabla అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఆయన తబలా వాయించిన వీడియో పోస్ట్ చేశారు. స్పైడర్ పంక్ అని పిలువబడే స్పైడర్ మ్యాన్ గిటార్ వాయించగా.. సూపర్ హీరో యొక్క ఏ వెర్షన్‌లో తబలా వాయించినట్లు కనిపించలేదు. ఈ వీడియో నెటిజన్లను ఆకర్షించింది. ఈ వీడియోకి మిలియన్లలో వ్యూస్ వచ్చాయి.

Amazing artist : రైలు ప్రయాణంలో తోటి ప్రయాణికుడికి తెలియకుండా చిత్రాన్ని గీసిన ఆర్టిస్ట్.. ఆ తరువాత

‘స్పైడర్ మ్యాన్.. ఇంట్లో’ అని ఒకరు.. ‘స్పైడర్ మ్యాన్ తబలా కోర్సులో చేరాడు’ అని మరొకరు ఫన్నీగా కామెంట్లు చేసారు. మొత్తానికి ఈ రకంగా ఆర్టిస్ట్‌లు తమ పాపులారిటీ నిలబెట్టుకునేందుకు వినూత్నంగా ప్రయత్నాలు చేస్తూ వీడియోలు చేసి వైరల్ అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Kiran Pal (@amanpaltabla)