చంద్రయాన్-2 లేటెస్ట్ అప్ డేట్

  • Published By: venkaiahnaidu ,Published On : September 10, 2019 / 07:04 AM IST
చంద్రయాన్-2 లేటెస్ట్ అప్ డేట్

Updated On : September 10, 2019 / 7:04 AM IST

చంద్ర‌యాన్‌2కు చెందిన ఆర్బిటార్‌.. విక్ర‌మ్ ల్యాండర్ ప‌డిన ప్రాంతాన్ని గుర్తించిన‌ట్లు ఇవాళ(సెప్టెంబర్-10,2019) ఇస్రో తెలిపింది. కానీ ఇప్పటిదాకా విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ తో ఎటువంటి క‌మ్యూనికేష‌న్ జ‌ర‌గ‌లేద‌ని ఇస్రో తెలిపింది.

ల్యాండ‌ర్‌తో క‌మ్యూనికేష‌న్ ఏర్ప‌రిచేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఇస్రో వెల్ల‌డించింది. సెప్టెంబ‌ర్ 7వ తేదీ రాత్రి 1.51 నిమిషాల స‌మ‌యంలో.. విక్ర‌మ్ ల్యాండ‌ర్ చంద్రుడి ఉప‌రిత‌లంపై దిగుతూ కుదేలుకు గురైంది. ల్యాండ‌ర్ వెలాసిటీ అదుపుత‌ప్ప‌డంతో అది స్టాఫ్ ల్యాండింగ్ కాలేదు. దీంతో ల్యాండ‌ర్ నుంచి సిగ్న‌ల్స్ బ్రేక‌్ అయ్యాయి.