Delhi : ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రోడ్డుపై స్నానం చేసిన యువకుడు.. కఠిన చర్యలు తీసుకోవాలంటున్న నెటిజన్లు
ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడింది. ఓ యువకుడు బకెట్ నీళ్లతో వచ్చి రోడ్డుపై కూర్చుని స్నానం చేయడం మొదలు పెట్టాడు. అతని చర్య చూసి జనం షాకయ్యారు. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న వీడియోపై జనం మండిపడుతున్నారు.

Delhi
Delhi : సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం కొందరు ఎలాంటి పనులైనా చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఢిల్లీలో రద్దీగా ఉండే లక్ష్మీనగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డుపై ఓ యువకుడు స్నానం చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
Rat Bathing in Rain : వార్నీ.. వానలో స్నానం చేస్తున్న ఎలుక.. సబ్బు ఇస్తే బాగుండు అంటూ కామెంట్లు
ఢిల్లీ లక్ష్మీనగర్ మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోహిత్ కుమార్ అనే యువకుడు ఊహించని పని చేశాడు. రద్దీగా ఉండే సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడిన సమయంలో బకెట్ తో నీరు తీసుకుని వచ్చి రోడ్డుపై కూర్చుని స్నానం చేయడం మొదలుపెట్టాడు. అతని విపరీతమైన చర్య చూసిన స్ధానికులు షాకయ్యారు. కొంతమంది అతని చర్యకు అసహనం వ్యక్తం చేస్తుంటే.. మరి కొందరు అతని సాహసం చూస్తూ ఆశ్చర్యపోయారు. తనకేమీ పట్టనట్లు రోహిత్ కుమార్ స్నానం కొనసాగించాడు. therohitk_ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేయడంతో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
యువకుడి చర్యలపై నెటిజన్లు తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరికొంతమంది జీవితంలో ఇంత కాన్ఫిడెన్స్ నాకు కూడా కావాలి.. అంటూ ఫన్నీగా రిప్లై చేశారు. ఏది ఏమైనా యువకులు ఇలాంటి ఫీట్లు చేయకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
View this post on Instagram