Viral Video: కొత్త ప్రయోగం.. విచిత్ర రీతిలో చికెన్ తందూరీ చేసిన మహిళ

సాధారణంగా పుచ్చపండు చాలా రుచిగా ఉంటుంది. అలాగే, చికెన్ తందూరీ నోరూరిస్తుంది.

సంప్రదాయ వంటకాలను భిన్నంగా ప్రతిరోజు ఎన్నో రకాల వంటకాలు పుట్టుకొస్తున్నాయి. మహిళా మణులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఎన్నడూ ఎవరూ చేయని కాంబినేషన్‌లో వంటలు వండుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతో పేరు తెచ్చుకుంటున్నారు.

తాజాగా ఓ మహిళ విచిత్ర కాంబినేషన్‌లో తందూరీ చేసి అందరి దృష్టినీ తనవైపునకు తిప్పుకుంది. ఆ మహిళ చేసిన ఈ వంట ప్రయోగంపై కొందరు ప్రశంసలు కురిపిస్తుండగా, మరికొందరు మాత్రం అటువంటి తందూరీ చేయడం ఎంటని విమర్శిస్తున్నారు. అందుకు కారణం ఆమె చికెన్ తందూరీ చేయడానికి పుచ్చపండును వాడడమే. దీనికి వాటర్‌మెలాన్ తందూరీ చికెన్ అని పేరు పెట్టింది.

సాధారణంగా పుచ్చపండు చాలా రుచిగా ఉంటుంది. అలాగే, చికెన్ తందూరీ కూడా టేస్టీగా ఉంటూ నోరూరిస్తుంది. అయితే, ఈ రెండింటినీ కలుపుతూ ఆమె తందూరీ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పుచ్చపండులోని ఎర్రని గుజ్జునంత తీసి ఓ గిన్నెలో వేసింది. పుచ్చపండు డొప్పలో చికెన్ ఉంచి కాల్చి తందూరీ తయారు చేసింది. ఎవరికీ తట్టని ఆలోచన ఈమెకి తట్టిందని నెటిజన్లు అంటున్నారు.

Also Read: బిహార్‌లో తప్పిన ప్రమాదం.. జలపాతంలో ఒక్కసారిగా పెరిగిన వరద ఉధృతి.. పర్యాటకులు ఎలా ఒడ్డుకు చేరారంటే..