ఉదయం 11 గంటల వరకు : నమోదైన పోలింగ్ శాతం ఎంతంటే?

2019 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగనుండగా.. ఏప్రిల్ 11 నుంచి తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది.

  • Published By: sreehari ,Published On : April 11, 2019 / 07:02 AM IST
ఉదయం 11 గంటల వరకు : నమోదైన పోలింగ్ శాతం ఎంతంటే?

2019 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగనుండగా.. ఏప్రిల్ 11 నుంచి తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది.

2019 లోక్ సభ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగనుండగా.. ఏప్రిల్ 11 నుంచి తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి మొత్తం 20 రాష్ట్రాల్లోని 91 లోక్ సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఆంద్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. తొలిదశ ఎన్నికల్లో మొత్తం 14.21 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఇందులో 7.22 కోట్లు మంది పురుషులు, 8.99 కోట్ల మంది మహిళలు ఉన్నారు. తొలిదశ లోక్ సభ ఎన్నికల బరిలో 1,279 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. గురువారం (ఏప్రిల్ 11, 2019)  ఉదయం 7గంటలకు  పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 11 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం నియోజవర్గాలవారీగా ఇలా నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో నాగాలాండ్ 41 శాతం తొలిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో బెంగాల్ 38.08 శాతం, మూడో స్థానంలో మిజోరం పోలింగ్ నిలిచింది. 

జమ్ము కశ్మీర్, బర్ముల్లా పార్లమెంటరీ నియోజవర్గాల్లో 24.66 శాతం నమోదు కాగా, పశ్చిమ బెంగాల్ (రెండుసీట్లతో కలిపి) 38.08 శాతం, త్రిపురా (ఒక స్థానం) 26.5 శాతం నమోదైంది. తెలంగాణలో ఓటింగ్ 22.84 శాతం రికార్డు కాగా, ఉత్తరాఖాండ్ 23.78 శాతం, లక్ష్యదీప్ 23.10 శాతం, మహారాష్ట్రలో (7స్థానాలు) 13.7 శాతం నమోదయ్యాయి. 8 పార్లమెంటరీ నియోజవర్గాల్లో మొత్తం ఓటింగ్ శాతం 24.32 శాతం వరకు పోలింగ్ నమోదైంది. మేఘాలయాలోని షిల్లాంగ్ లో 11 గంటల వరకు ఓటింగ్ 27 శాతం నమోదైంది. నాగాలాండ్ లో 41 శాతం, అరుణాచల్ ప్రదేశ్ 27.48 శాతం, తెలంగాణ 22.84 శాతం, మిజోరం 29.8 శాతం, పశ్చిమ బెంగాల్ 38.08 శాతం, మణిపూర్ 35.03 శాతంగా నమోదైంది.