Five States Election : మణిపూర్‌లో చివరి దశ పోలింగ్ షురూ.. భారీ భద్రత
శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 92 మంది అభ్యర్థులు

Manipur Assembly Elections
Manipur Elections 2022 : ఐదు రాష్ట్రాల ఎన్నికలు లాస్ట్ స్టేజ్ కు చేరుకున్నాయి. యూపీలో ఏడు దశల్లో ఇప్పటికీ ఆరు దశలు పూర్తయ్యాయి. మరొక దశ పోలింగ్ జరగాల్సి ఉంది. మణిపూర్ లో రెండు దశల్లో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే ఒక దశ పోలింగ్ పూర్తికాగా.. 2022, మార్చి 05వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. 92 మంది అభ్యర్థులు బరిలో నిలుచున్నారు. ఎన్నికల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 1247 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. పోలింగ్ లో పలువురు ప్రముఖుల భవితవ్యం తేల్చుకోబోతున్నారు.
Read More : Anand Mahindra: మణిపూర్లో రోడ్డు ట్రాఫిక్ నిబద్ధత చూసి ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
మాజీ సీఎం ఇబోబిసింగ్, మాజీ డిప్యూటీ సీఎం గైఖాంగమ్ గాంగ్ మీ తదితరులున్నారు. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన మొదటి దశ పోలింగ్ లో కొన్ని హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు పోలీసులు భారీ స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదు నియోజకవర్గాల్లోని 12 పోలింగ్ స్టేషన్ లో రీ పోలింగ్ కు ఎన్నికల అధికారులు ఆదేశించారు. రీ పోలింగ్ కూడా కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్, జనతాదళ్ తదితర పార్టీలు సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి.
Read More : 5 States Elections : మణిపూర్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ డ్యాన్స్
రాష్ట్రంలో పార్టీల కంటే అభ్యర్థులకే ఓటర్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మణిపూర్ లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగింది. కాంగ్రెస్ 54, జేడీయూ 38, ఎన్పీపీ 42 సీట్లలో అభ్యర్థులను దింపాయి. బీరెన్ సింగ్ స్వతంత్ర అభ్యర్థి, మరియు మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా. కాగా….గత ఐదేళ్లలో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి మారారు. ముఖ్యమంత్రి నోంగ్‌థోంగ్‌బామ్ బీరెన్ సింగ్, మాజీ కాంగ్రెస్ నాయకుడు, మణిపూర్‌లో పార్టీ లోపల బలమైన లాబీతో ఐదేళ్లుగా కూటమిని నడిపించగలిగారు. 60 అసెంబ్లీ స్థానాలున్న మణిపూర్ లో ప్రభుత్వ ఏర్పాటుకు 31 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 28 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీకి 21 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఎన్ పీపీ, ఎన్ పీఎఫ్ చెరో నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి. తృణముల్ కాంగ్రెస్ ఒక్క నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి మరో చోట విజయం సాధించారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ కాదని… ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని గవర్నర్ ఆహ్వానించడం గమనార్హం. మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తీరుపై అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
Read More : Manipur Assembly Elections : మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ మారింది.. ఎప్పుడంటే?
– మొత్తం స్థానాలు – 60
– ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన స్థానాలు- 31
– అధికారంలో బీజేపీ కూటమి
– బీజేపీ కూటమికి 25 స్థానాలు
– కాంగ్రెస్‌కు 17 స్థానాలు
Voting for the last phase of #ManipurElections2022 begins; 92 candidates across 22 assembly constituencies in fray.
Repolling also being held in 12 polling stations across 5 constituencies that went to the poll on Feb 28th in the first phase. pic.twitter.com/E87Wvajvgv
— ANI (@ANI) March 5, 2022