Warn To CM : ‘సీఎం పదవికి రాజీనామా చేయకపోతే చంపేస్తా..హత్యకు ఓ షూటర్ ను కూడా నిమించుకున్నా’

మూడు నెలల్లో CM పదవికి రాజీనామా చేయకపోతే చంపేస్తా అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రికే ఓ వ్యక్తి బెదిరించాడో వ్యక్తి. హత్య కోసం ఓ ప్రత్యేక షూటర్ ను కూడా నియమించుకున్నా అంటూ వార్నింగ్.

Warn To CM : ‘సీఎం పదవికి రాజీనామా చేయకపోతే చంపేస్తా..హత్యకు ఓ షూటర్ ను కూడా నిమించుకున్నా’

Death Threat Warn To Cm

Updated On : March 14, 2022 / 11:53 AM IST

Death Threat Warn to CM : CM పదవికి రాజీనామా చేయకపోతే చంపేస్తా అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రికే ఓ వ్యక్తి బెదిరింపుల వచ్చాయి. మీకు మూడు నెలలు డెడ్ లైన్ పెడుతున్నా..ఈలోపే సీఎం పదవివకి రాజీనామా చేయాలి. లేదంటే మిమ్మల్ని చంపటం ఖాయం. హత్య కోసం ఓ ప్రత్యేక షూటర్ ను కూడా నియమించుకున్నాను అంటూ ఓ వ్యక్తి మిజోరం సీఎం జొరాంథంగా(Mizoram CM Zoramthanga)కు ఓ దుండగుడు బెదింపులకు పాల్పడ్డాడు. సోషల్​ మీడియా ద్వారా ఓ వ్యక్తి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు.

Also read : MP BJP : మద్యం షాపుపై దండెత్తిన ఉమా భారతి..రాళ్లతో దాడి చేసి సొంత ప్రభుత్వానికే ధమ్కీ

దీంతో పోలీసులు రంగంలోకి దిగటంతో కథ అడ్డం తిరిగింది. ఆదివారం (మార్చి 13,2022) సదరు వ్యక్తి అరెస్ట్ అయ్యి కటకటాలు లెక్కపెడుతున్నాడు. మిజోరం సీఎంపై బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఖాజ్వల్​ ప్రాంతానికి చెందిన రోడిన్​లియానా అలియాస్​ అపుయా టోచ్ఛాంగ్​గా అనే 37 ఏళ్ల వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఐజ్వాల్​లోని ఛాన్మరీ ప్రాంతంలో నివాసం ఉంటున్న నిందితుడు.. ‘తింగ్​ట్లాంగ్​ పా’ అనే నకిలీ అకౌంట్​తో సీఎంపై బెదిరింపులకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

అంతేకాదు నిందితుడు ఈ బెదిరింపులను ఇతర ఫేస్​బుక్​ గ్రూపుల్లో షేర్​ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇంతకు సదరు వ్యక్తి ఎందుకు ఈ బెదిరింపులకుదిగాడంటే..సీఎం జోరంతంగా రాష్ట్ర బడ్జెట్​ను తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారంటూ ఆరోపించారు. అదే విషయాన్ని పోలీసులు తెలిపారు. ఈ బెదిరింపుల వ్యవహారంలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Also read :  Canada accident : కెనడాలో వ్యాన్ ను ఢీకొన్ని ట్రాక్టర్.. ఐదుగురు భారతీయ విద్యార్థుల మృతి

కాగా సదరు నిందితుడు సీఎంను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడటం ఇది మొదటిసారి కాదట. 2018లో కూడా అప్పుడు సీఎంగా ఉన్న లాల్​ తన్హావాలాకు కూడా ఇలాగే బెదిరింపు లేఖ రాశాడట. అప్పుడు కూడా సీఎంను చంపేస్తానంటూ బెదిరింపులు చేయటంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.