Video: భారీ మొసలిని భుజాలపై మోసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపర్చిన యువకుడు

నెల రోజుల క్రితం చెరువులో మొసలి కనిపించడంతో నీటి కోసం అక్కడకు వెళ్లడానికే గ్రామస్థులు భయపడుతున్నారు.

Video: భారీ మొసలిని భుజాలపై మోసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపర్చిన యువకుడు

Updated On : November 29, 2024 / 11:35 AM IST

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ఓ భారీ మొసలిని భుజాలపై మోసుకెళ్లి అందరినీ ఆశ్చర్యపర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 20 అడుగుల పొడవు, 150 కిలోల బరువున్న మొసలిని ఆ యువకుడు మోసుకెళ్లడం గమనార్హం.

హమీర్‌పూర్ జిల్లా పరిధిలోని పౌతియాఖుర్ద్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నెల రోజుల క్రితం చెరువులో మొసలి కనిపించడంతో నీటి కోసం అక్కడకు వెళ్లడానికే గ్రామస్థులు భయపడుతున్నారు. స్థానికులు అటవీ శాఖకు ఫిర్యాదు చేయడంతో దాన్ని పట్టుకోవడానికి సిబ్బంది వచ్చారు.

ఆ మొసలిని సిబ్బంది పట్టుకున్నారు. అందులోని ఓ యువకుడు ఇలా చివరకు దాన్ని భుజాలపై మోసుకెళ్లాడు. ఆ సమయంలో కొందరు ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్‌లో బంధించారు. మొసలిని తన భుజాలపై మోసుకెళ్లే ముందు అటవీ శాఖ అధికారి దాని నోరు, అవయవాలను గుడ్డ, తాడుతో కట్టేశారు. మొసలిని రక్షించిన తర్వాత దానిని అరణ్యంలోకి వదిలారు.

Vladimir Putin: ‘ట్రంప్ ఇప్పుడు సురక్షితంగా లేరు’ అంటూ పుతిన్ కామెంట్స్‌