అయ్యో పాపం.. వయనాడ్ బాధితురాలు శ్రుతి జీవితంలో మరో అంతులేని విషాదం..

వయనాడ్ జిల్లా చూరాల్లమ గ్రామానికి చెందిన శ్రుతికి 24ఏళ్లు. ఆమె కుటుంబంలోని తొమ్మిది సభ్యులు వయనాడ్ పెనువిషాదంలో మృతిచెందారు. అంతకు కొద్దిరోజుల ముందే

అయ్యో పాపం.. వయనాడ్ బాధితురాలు శ్రుతి జీవితంలో మరో అంతులేని విషాదం..

Sruthi Family

wayanad landslide : కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రాత్రివేళ గాడనిద్రలో ఉండగానే వందలాది మంది కొండచరియల కింద సజీవదహనం అయ్యారు. ఈ విషాద ఘటనలో 270 మందికిపైగా మృతిచెందగా.. మరికొందరు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కేరళ వయనాడ్ విలయం తరువాత ప్రధాని నరేంద్ర మోదీ బాధితులను పరామర్శించేందుకు అక్కడికి వెళ్లారు.. ఆ సమయంలో ఓ యువతి, యువకుడు కలిసి మోదీతో మాట్లాడటం జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది.. దీనికి కారణం.. ఆ యువతి తల్లిదండ్రులతో సహా తొమ్మిది మంది కుటుంబ సభ్యులను పోగొట్టుకుంది.

Also Read : Wayanad Landslide : వయనాడ్​ విలయాన్ని రికార్డ్ చేసిన ఇస్రో శాటిలైట్స్

వయనాడ్ జిల్లా చూరాల్లమ గ్రామానికి చెందిన శ్రుతికి 24ఏళ్లు. ఆమె కుటుంబంలోని తొమ్మిది సభ్యులు వయనాడ్ పెనువిషాదంలో మృతిచెందారు. అంతకు కొద్దిరోజుల ముందే శ్రుతి వివాహం నిశ్చయమైంది. తన చిరకాల మిత్రుడైన జెన్సన్ తో జూన్ 2న ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో వారి నిశ్చితార్ధం జరిగింది. అంతా హ్యాపీగా సాగుతున్న ఆమె జీవితంలో జూన్ 30న చోటుచేసుకున్న వయనాడ్ ఘటన తీవ్ర విషాదాన్నినింపింది. ఈ విషాద సమయంలో ఆమెకు కాబోయే భర్త జెన్సన్ అండగా నిలిచాడు. కష్టకాలంలో తన ఉద్యోగాన్నిసైతం వదలుకొని వచ్చి శ్రుతికి అనుక్షణం అండగా ఉంటూ వచ్చాడు. వయనాడ్ విషాదం నుంచి ఇప్పుడిప్పుడే శ్రుతి కోలుకుంటుంది. జెన్సన్ తో కొత్త జీవితంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతుంది. ఈ సమయంలో ఆమె జీవితంలో మరో విషాదం చోటు చేసుకుంది.

 

శ్రుతికి కాబోయే భర్త జెన్సన్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈనెల 10న శ్రుతి, జెన్సన్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు ఓమ్నీ వ్యానులో బయలుదేరారు. కోజికోడ్ – కొల్లేగల్ జాతీయ రహదారిపై వీరి వాహనం, ఓ ప్రైవేట్ బస్సు ఢీకున్నాయి. ఈ ఘటనలో జెన్సన్ కు తీవ్ర గాయాలు కావటంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జెన్సన్ బుధవారం రాత్రి మరణించాడు. అటు కుటుంబాన్ని పోగొట్టుకొని, ఇటు చిన్ననాటి స్నేహితుడు, కాబోయే భర్తను కాల్పోయి శ్రుతి శోకసంద్రంలో మునిగిపోయింది. శ్రుతికి ఎదురైన వరుస విషాదలతో స్థానికులు చలించిపోతున్నారు. ఇలాంటి కష్టం మరోసారి ఎవ్వరికీ ఇవ్వొద్దు దేవుడా అంటూ వేడుకుంటున్నారు.