West Bengal Election Results 2026 Live: బెంగాల్ పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో హోరాహోరీ
West Bengal Elections Results 2026 Live : పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. పశ్చిమ బెంగాల్ లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒక స్థానంలో ఈనెల 21న రీపోలింగ్ నిర్వహిచబోతున్నారు.
West Bengal Election Results 2026 Live
West Bengal Elections Results 2026 Live : భవానీ పూర్ నియోజకవర్గంలో పోటా పోటీ నెలకొంది. బీజేపీ నేత సువేందు అధికారిపై టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ముందంజలో ఉన్నారు.
పశ్చిమ బెంగాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో హోరాహోరీ కొనసాగుతోంది. బీజేపీ, టీఎంసీ పోటాపోటీగా ఉన్నాయి.
దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. పశ్చిమ బెంగాల్ లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒక స్థానంలో ఈనెల 21న రీపోలింగ్ నిర్వహిచబోతున్నారు. మిగిలిన 293 స్థానాల ఓట్ల లెక్కింపుకోసం 77 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 432 మంది కౌంటింగ్ పరిశీలకులను నియమించింది.
రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించగా.. రికార్డు స్థాయిలో 92.47శాతం ఓటింగ్ నమోదైంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో భారీగా ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. అయితే, ఈ భారీ ఓటింగ్ ఎవరికి మేలు చేస్తుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
