వారానికి రెండు రోజులు కచ్చితంగా లాక్‌డౌన్ అంటోన్న వెస్ట్ బెంగాల్ సీఎం

వారానికి రెండు రోజులు కచ్చితంగా లాక్‌డౌన్ అంటోన్న వెస్ట్ బెంగాల్ సీఎం

Updated On : July 20, 2020 / 7:24 PM IST

రాష్ట్రంలో COVID-19 వ్యాప్తిని అడ్డుకునే దిశగా పశ్చిమబెంగాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వారానికి రెండు రోజుల పాటు పూర్తి స్థాయి లాక్‌డౌన్ విధించనున్నట్లు ప్రకటించారు. ఈ వారం నుంచే ఈ ప్రోసెస్ ను మొదలుపెట్టారు. తొలిసారిగా జులై 23నుంచి జులై 25వరకూ నిర్వహించనున్నట్లు పశ్చిమబెంగాల్ బంద్యోపాద్యాయ్, హోం సెక్రటరీ అన్నారు. ఆ రోజుల్లో అన్నీ ఆఫీసులతో పాటు ట్రాన్స్‌పోర్ట్ సర్వీసులు కూడా పూర్తిగా నిలిపివేయనున్నారు.

వచ్చేవారం లాక్ డౌన్ ను జులై 29 నుంచి నిర్వహిస్తారని హోం సెక్రటరీ అన్నారు. లాక్ డౌన్ సమయంలో కంటైన్మెంట్ జోన్లు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం కఠినంగా ఉంటున్నాయి. ఇటీవల కంటైన్మెంట్ జోన్లు, బఫ్ఫర్ జోన్లు కలిపేసిన ప్రభుత్వం.. వాటిని బ్రాడ్ బేస్‌డ్ కంటైన్మెంట్ జోన్లుగా కేటాయించింది. కొవిడ్ 19 కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ కొద్ది ఏరియాల్లో నమోదైందని బందోపాధ్యాయ్ అన్నారు.

దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్లో కొవిడ్ 19 యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. దక్షిణంగా 24పరగణాల్లో స్టేట్ జనరల్ హాస్పిటల్స్ ను సెటప్ చేయనున్నారు. జిల్లాల్లోని హాస్పిటళ్లలో బెడ్లను పెంచడం ఒకటే ఆప్షన్ గా మిగిలి ఉంది. సిటీ హాస్పిటల్స్ పైనా ఒత్తిడి పెంచుతున్నాం. రాష్ట్రంలో టెస్టింగ్ యూనిట్లు పెంచాలని మమతా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది.

పశ్చిమబెంగాల్ లో కొవిడ్ 19 కేసులు పెరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. వ్యాప్తిని అడ్డుకునేందుకు మరిన్ని టెస్టులు చేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను పెంచాలనుకుంటుంది. రాష్ట్రంలోని కరోనావైరస్ పేషెంట్లు మొత్తం 42వేల 487 ఉన్నాయి. అందులో ఒక వెయ్యి 112మంది ప్రాణాలు కోల్పోయారు.

గత వారం మమతా బెనర్జీ ప్రభుత్వం దేశీ విమానాల రాకపోకల నిషేదాన్ని పొడిగించింది. దేశంలోని ఆరు ప్రధాన నగరాల నుంచి విమానాలను జులై 31వరకూ అనుమతించబోమని చెప్పింది. ఢిల్లీ, పూణె, ముంబై, నాగ్‌పూర్, చెన్నై, అహ్మదాబాద్ ల నుంచి పశ్చిమబెంగాల్ కు విమానాలు రావడానికి లేదు. దీనిని గతంలో జులై 6నుంచి 19వరకూ మాత్రమే నియమించారు.