నందిగ్రామ్ లో రెండు ఇళ్లు అద్దెకు తీసుకున్న మమతా బెనర్జీ..ఎందుకంటే..

నందిగ్రామ్ లో రెండు ఇళ్లు అద్దెకు తీసుకున్న మమతా బెనర్జీ..ఎందుకంటే..

Mamata Banerjee Rents Two Houses In Nandigram

Updated On : March 22, 2021 / 1:35 PM IST

Mamata banerjee rents two houses in Nandigram : ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ నందిగ్రామ్‌లో రెండు ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. దీని వెనుక దీదీ యోచన ఏంటాని ప్రజలు అనుకుంటున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే తన ఇంటిని అద్దెకు తీసుకున్నందో ఆ ఇంటి య‌జ‌మాని అయిన ఓ రిటైర్డ్ హైస్కూల్ టీచ‌ర్ సుద‌మ్ చంద్ర పారుయ్ తెగ ఆనంద‌ప‌డిపోతున్నారు.

కాగా..సీఎం మమతా బెనర్జీకి నందిగ్రామ్‌లోని రేయ‌పారాలో రెండు ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. ఆమె తలచుకుంటే రెండేంటీ ఎన్ని ఇళ్లైనా కొనుకోవచ్చు. కానీ కేవలం అద్దెకు మాత్రమే తీసుకున్నారు? అంటే దీంట్లో దీదీ ప్లాన్ కూడా ఉండే ఉంటుంది. దీంట్లో ముఖ్య కారణం ‘‘మ‌మ‌త‌ బ‌య‌టి నుంచి వచ్చిన వ్య‌క్తి అంటూ ప్ర‌త్య‌ర్థి పార్టీ అయిన బీజేపీ అభ్య‌ర్థి సువేందు అధికారి ప‌దే ప‌దే ఆరోప‌ణ‌లు చేస్తుండ‌టంతో ఆమె ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు త్వ‌ర‌లోనే తాను నందిగ్రామ్ శాశ్వ‌త నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటాన‌ని ఆదివారం ( మార్చి 21,2021) ఎన్నిక‌ల ర్యాలీలో దీదీ ప్ర‌క‌టించారు.

కానీ ఇక్కడ గమనించాల్సిన ఓ విషయం ఏమిటంటే..మ‌మ‌త సంవత్సరం క్రితమే ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. మరో ఇంటిని మాత్రం గత ఆరు నెలల క్రితం అద్దెకు తీసుకున్నారు. ఈ రెండు ఇళ్ల‌కు మ‌ధ్య దూరం 100 మీట‌ర్లే. అంత దగ్గరగా ఉండే ఇళ్లనే ఆమె కిరాయికి తీసుకున్నారు. తాను నందిగ్రామ్ నుంచే పోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్ప‌టి నుంచీ టీఎంసీ నేత‌లు ఆమె కోసం అక్క‌డ ఇళ్ల వేట మొద‌లుపెట్టి.. చివ‌రికి ఈ రెండు ఇళ్ల‌ను ఫైన‌ల్ చేసి ఆ ఇళ్లనే కిరాయికి తీసుకున్నారు. ముందు రెంట్ కు తీసుకున్న ఇంటిలోనే మమత ఉందామనుకున్నారు. ఈ ఇంటి రూమ్ లు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాయి. దీంతో ఆమెకు కాలి గాయంతో ఇబ్బందిగా ఉంటుంది.

ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఆమెమీద దాడి జరగటం..ఆ దాడిలో ఆమె కాలికి పెద్ద గాయంకావటంతో ఆమె ప్రస్తుతం వీల్ చైర్ కే పరిమితమయ్యారు. దీంతో రెండో ఇంటిని కూడా రెంట్ కు తీసుకోవాలని నిర్ణయించి తీసుకున్నారు. ఇప్ప‌టికే ఆ ఇంటి దగ్గ‌ర భ‌ద్ర‌త‌ను పెంచారు. ఇదిలా ఉంటే సాక్షాత్తూ ముఖ్యమంత్రే తన ఇంటిని అద్దెకు తీసుకున్నందో ఆ ఇంటి య‌జ‌మాని అయిన ఓ రిటైర్డ్ హైస్కూల్ టీచ‌ర్ సుద‌మ్ చంద్ర పారుయ్ తెగ ఆనంద‌ప‌డిపోతున్నారు.