2024 Elections: అటు ఎన్డీయే కాదు, ఇటు ఇండియా కాదు.. తటస్థంగా ఉన్న పార్టీల పరిస్థితి ఏంటి?

1989 ఎన్నికల నాటి ఫలితాలు కూడా దాదాపు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. వీపీ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా జనతాదళ్, బీజేపీతో పాటు అనేక పార్టీలు కూటమి కట్టాయి. అప్పుడు మాయావతి, నితీష్ కుమార్‌లు ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థ విధానం అవలంబించారు

2024 Elections: అటు ఎన్డీయే కాదు, ఇటు ఇండియా కాదు.. తటస్థంగా ఉన్న పార్టీల పరిస్థితి ఏంటి?

Updated On : July 22, 2023 / 1:33 PM IST

Neutral Parties: ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేలోని 38 పార్టీలు, ఇండియా కూటమిలోన 26 పార్టీల భవిష్యత్తు మాత్రమే కాదు. ఏ కూటమిలో చేరకుండా తటస్థంగా ఉన్న పార్టీలు భవిష్యత్ కూడా రాబోయే ఎన్నికల్లో తేలనుంది. రెండు కూటముల్లో ఉన్న మొత్తం 64 పార్టీలే కాకుండా బహుజన్ సమాజ్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజూ జనతాదశ్, భారత్ రాష్ట్ర సమితి వంటి అనేక పార్టీలు తటస్థంగా ఉన్నాయి.

West Bengal : బెంగాల్‌లోనూ మణిపూర్ తరహా ఘటన…ఇద్దరు మహిళలను కొట్టి అర్ధనగ్నంగా ఊరేగించారు…

మరి ఇలా తటస్థంగా ఉండడం వల్ల ఆ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో లాభపడ్డాయా, నష్టపోయాయా అంటే.. నష్టపోయాయనే ఎన్నికల చరిత్ర చెబుతోంది. కూటములు ఆవిర్భవించినప్పుడు ప్రజల ఆలోచనలు దాదాపుగా కూటముల వైపే ఉంటాయి. ఏదో ఒక కూటమికి ఓటేయానికే మొగ్గు చూపుతారు. ఈ సందర్భంలో తటస్థంగా ఉన్న పార్టీలను పెద్దగా పట్టించుకోరు. కొన్ని సార్లు ఆ పార్టీలు ఓట్లు దక్కించుకున్నప్పటికీ.. సీట్లపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

YS Viveka Case : వైఎస్ వివేకా హత్య కేసు.. వైఎస్ షర్మిలను సాక్షిగా చేర్చిన సీబీఐ, వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడి

కాగా, ఈసారి తటస్థంగా ఉన్న పార్టీల్లో 10 పార్టీలు లోక్‌సభలో ప్రాతినిధ్యం కలిగి ఉన్నాయి. ఆ పార్టీల మొత్తం సీట్ల సంఖ్య 64. ఎన్నికల వరకు ఈ పార్టీలు ఇదే వైఖరి కొనసాగిస్తే.. ఆ పార్టీల స్థాయి తగ్గే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మొదటిసారి జనతా పార్టీ పేరుతో ఒక కూటమి ఏర్పడింది. ఆ సమయంలోనే ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపించింది. 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ వైపు కాకుండా, ఇటు జనతా పార్టీ వైపు కాకుండా ఉన్న పార్టీలు నష్టపోయాయి.

Shivraj Chouhan on INDIA Alliance కళంకితులంతా ఒక చోటకు చేరారట.. ‘ఇండియా’ కూటమిపై ఎంపీ సీఎం శివరాజ్ చౌహాన్ విమర్శలు

ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో పెద్ద పార్టీలైన కాంగ్రెస్, జనతా పార్టీలకు ఏకంగా 76 శాతం ఓట్లు వచ్చాయి. తటస్థంగా ఉన్న వామపక్షాలు 19 సీట్లకు తగ్గాయి. ఇక డీఎంకే అతి ఎక్కువగా నష్టపోయింది. ఆ పార్టీ బలం 23 నుంచి రెండు స్థానాలకు తగ్గింది.

Netflix : నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారా? ఇకపై కష్టమే.. పాస్‌వర్డ్ షేరింగ్ బ్యాన్ చేసిన నెట్‌ఫ్లిక్స్..

ఇక 1989 ఎన్నికల నాటి ఫలితాలు కూడా దాదాపు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. వీపీ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా జనతాదళ్, బీజేపీతో పాటు అనేక పార్టీలు కూటమి కట్టాయి. అప్పుడు మాయావతి, నితీష్ కుమార్‌లు ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థ విధానం అవలంబించారు. అలాగే 2014 ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అయితే 2019లో సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని 10 సీట్లు సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్తామని మాయావతి ప్రకటించారు. ఇది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

ఏ కూటమిలో లేని పార్టీలు
1. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
2. బిజూ జనతా దళ్
3. భారత్ రాష్ట్ర సమితి
4. బహుజన్ సమాజ్ పార్టీ
5. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్
6. తెలుగుదేశం పార్టీ
7. శిరోమణి అకాలీదళ్
8. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్
9. జనతాదళ్ సెక్యులర్
10. నేషనల్ డెమోక్రటిక్ పార్టీ