Norovirus: నోరో వైరస్ అంటే ఏమిటి? వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
పలు రకాల వైరస్ లు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నాయి. కరోనా వైరస్ తో మూడేళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇంతలోనే మంకీ మాక్స్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందా అన్న ఆందోళన ప్రతిఒక్కరిలో వ్యక్తమవుతోంది. ఇదిలా చాలదన్నట్లు తాజాగా నోరో వైరస్ భయపెడుతుంది. భారత్ లో వైరస్ కు సంబంధించిన కేసును వైద్యులు గుర్తించారు.

Noro
Norovirus: పలు రకాల వైరస్ లు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నాయి. కరోనా వైరస్ తో మూడేళ్లుగా ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇంతలోనే మంకీ పాక్స్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందా అన్న ఆందోళన ప్రతిఒక్కరిలో వ్యక్తమవుతోంది. ఇదిలా చాలదన్నట్లు తాజాగా నోరో వైరస్ భయపెడుతుంది. భారత్ లో వైరస్ కు సంబంధించిన కేసును వైద్యులు గుర్తించారు. కేరళలోని తిరువనంతపురంలో ఇద్దరు పిల్లలకు ఈ వైరస్ సోకినట్లు గుర్తించారు. దీంతో నోరో వైరస్ అంటే ఏమిటి.. దాని లక్షణాలు.. అది సోకితే చనిపోయే ప్రమాదం ఎంత మేర ఉంటుందనే చర్చ సర్వత్రా సాగుతుంది. నోరో వైరస్ ముఖ్యంగా తీవ్రమైన విరేచనాలు, వాంతులు కలిగి ఉండే వైరస్ ల సమూహం. ఇది వైరస్ అయినప్పటికీ కడుపు ప్లూ అని కూడా పిలుస్తారు. నోరో వైరస్ అంటు వ్యాధి, కలుషిత ఆహారం తీసుకోవటం వల్ల వ్యాపించే అవకాశాలు ఉన్నాయి.
1968లో అమెరికాలోని ఒహియోలో వైరస్‌ను తొలిసారిగా కనుగొన్నారు. కేరళలోని తిరువనంతపురంలో ఇద్దరు పిల్లలకు సోకిన తర్వాత ఈ వైరస్ ఇటీవల దేశంలోని ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. నోరో వైరస్ లలో అనేక రకాలు ఉన్నాయి. ఈ వైరస్ సోకినప్పుడు చాలా మంది ఆస్పత్రికి వెళ్లకుండానే తగ్గిపోతుంది. అయితే పిల్లలు, పసి బిడ్డలు, వృద్ధుల్లో వైరస్ శక్తివంతంగా పనిచేసి ప్రమాదకారణంగా మారుతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ వైరస్ తీవ్ర ఎక్కువగా ఉంటుంది. పాఠశాలలు, మెట్రో, ఆసుపత్రులు, మార్కెట్‌లు వంటి రద్దీ ప్రదేశాలు ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందడానికి కేంద్రాలుగా నిలుస్తాయి.
నోరో వైరస్ అంటువ్యాధి, వేగంగా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి మిలియన్ల కొద్దీ నోరోవైరస్ కణాలను పోగొట్టగలడు. రోగితో పరిచయం ఉన్న, వైరస్ ద్వారా కలుషితమైన నీరు త్రాగడం. కలుషితమైన ఆహారం తినడం, రోగితో ఆహారం పంచుకోవటం, చేతులు తాకడం, వైరస్ ఉన్న వ్యక్తితో సన్నిహిత, శారీరక సంబంధం కలిగి ఉండటం వల్ల నోరో వైరస్ సోకే అవకాశం ఉంటుంది. నోరో వైరస్ లక్షణాలు ఒకటి నుంచి మూడు రోజులు మాత్రమే ఉంటునట్లు వైద్యులు పేర్కొంటున్నారు. వైరస్ మీ శరీరంలో సోకి కొన్ని వారాల పాటు అయినప్పటికీ లక్షణాలు కనిపించకపోవచ్చు. నోరో వైరస్ సోకిన వారిలో నీరసం, వికారం, వాంతులు, విరేచనాలు, కండరాలలో నొప్పి, కడుపు నొప్పి, జ్వరం, తల తిరగడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. అవి ఎక్కువ రోజులు ఉండే వైద్యుడిని సంప్రదించాలి.
నోరో వైరస్ సోకకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. కలుషితమైన ఆహారం, కలుషిత నీరు తీసుకోవద్దు. తాగునీటి అవసరాలకు క్లోరిన్ కలిపిన నీటిని వినియోగించాలి. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు బాగా కడిగిన తర్వాతే వాడాలి. సీఫుడ్, పీత, మస్సెల్స్, షెల్ఫిష్‌లను సరిగ్గా ఉడికిన తర్వాత మాత్రమే తినాలి. ఆల్కహాల్ బేస్డ్ జెల్స్ నోరో వైరస్‌ను నిర్వీర్యం చేయలేవు. ఎవరిలోనైనా వైరస్ సోకితే.. వెంటనే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అన్ని ఉపరితలాలను పూర్తిగా శుభ్రం చేయాలి. లక్షణాలు తగ్గిపోయినప్పటికీ 48 గంటల పాటు బాధితులు వంట చేయకపోవడం మంచిది. బాధితులు ఉపయోగించిన దుస్తులను 60 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే నీరు, డిటర్జెంట్ సాయంతో శుభ్రం చేసుకోవచ్చు. నోరో వైరస్ సోకితే భయపడొద్దు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతోపాటు ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి.