అయ్యప్ప ఆలయంలోకి మహిళ ఎంట్రీ ఎలాగంటే 

  • Published By: veegamteam ,Published On : January 2, 2019 / 10:20 AM IST
అయ్యప్ప ఆలయంలోకి మహిళ ఎంట్రీ ఎలాగంటే 

శబరిమల : అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేసిన తరువాత జరిగిన కీలక పరిణామల మధ్య పలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం అనంతరం పలు వివాదాల నేపథ్యంలో ఈరోజు తెల్లవారుఝూమున 3.45 నిమిషాలకు బిందు, కనకదుర్గలు అధికారుల సమక్షంలో అయ్యప్పను దర్శించుకున్నారు. వీరిద్దరి అయ్యప్ప గర్భాలయం ప్రవేశం ఆద్యంతం పూర్తి రహస్యంగా జనవరి 1వ తేదీ  తెల్లవారుజామున సుప్రభాత సమయంలో బిందు, కనకదుర్గలను ప్రభుత్వ అధికారులే కొండపైకి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. వీరి ప్రవేశం జరిగిన సమయంలోనే పలువురు అయ్యప్ప భక్తులు అక్కడే వున్నా వీరిని ఆపేందుకు యత్నించలేదు.  ఈ క్రమంలో దుర్గ, కనకదుర్గలను ఎవరికంటా పడకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకున్న అధికారులు, చిన్నపాదంవైపు కాకుండా, పంబ నుంచి సన్నిధానానికి వెళ్లే రోడ్డు మార్గం గుండా వీరిని తీసుకెళ్లారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఓ అంబులెన్స్ లో వీరిని కొండపైకి తీసుకు వెళ్లినట్టు తెలుస్తోంది. అప్పటికే ఈ విషయాన్ని ఆలయం వద్ద భద్రతా విధుల్లో ఉన్న పోలీసులకు విషయం చెప్పగా, వారు పదునెట్టాంబడి సమీపంలో భక్తులు ఎవరూ లేకుండా చూశారు.
ఆపై వీరు 18 బంగారు మెట్లపై నుంచి ఎక్కి, పరిగెత్తుతూ ఆలయంలోకి వెళుతుంటే, వెనుకే ఓ కెమెరా వీరిని అనుసరించింది షూట్ చేసిన దృశ్యాలే ఇప్పుడు బయటకు వచ్చాయి. స్వామి దర్శనం అనంతరం వీరిని అంతే వేగంగా కొండ కిందకు దింపి, ప్రత్యేక వాహనంలో నీలక్కల్ దాటించినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారన్న విషయమై సమాచారం లేదు.

ఇక ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేరళ బీజేపీ నేత రమేష్, శబరిమలలోని అన్ని సీసీటీవీ ఫుటేజ్ లనూ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వీరు భక్తుల కంటబడకుండా కొండపైకి వచ్చారంటే, అది ప్రభుత్వ కుట్రేనని, తాము రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడతామని హెచ్చరించారు.