శబరిమలైలో ఏం జరుగబోతోంది : తెరుచుకోబోతున్న సన్నిధానం

శబరిమలైలో ఏం జరగబోతోంది. మండలపూజకి మణికంఠుడు సిద్ధమవుతోన్న వేళ ఇదే ప్రశ్న ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

  • Published By: veegamteam ,Published On : November 16, 2019 / 02:18 AM IST
శబరిమలైలో ఏం జరుగబోతోంది : తెరుచుకోబోతున్న సన్నిధానం

Updated On : November 16, 2019 / 2:18 AM IST

శబరిమలైలో ఏం జరగబోతోంది. మండలపూజకి మణికంఠుడు సిద్ధమవుతోన్న వేళ ఇదే ప్రశ్న ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

శబరిమలైలో ఏం జరగబోతోంది. మండలపూజకి మణికంఠుడు సిద్ధమవుతోన్న వేళ ఇదే ప్రశ్న ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. కోర్టు తీర్పు ప్రకారం అయ్యప్పని దర్శించుకుంటామంటూ మహిళలు పట్టు పడుతుండగా మీకు రక్షణ కల్పించడం మావల్ల కాదంటూ ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో సన్నిధానం పరిసరాల్లో టెన్షన్ వాతావరణం కన్పిస్తోంది. మండల పూజకి మలయప్ప సిద్ధమవుతోన్న వేళ..సన్నిధానం పరిసరాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంటోంది. భక్తుల శరణు ఘోష మాత్రమే విన్పించాల్సిన వేళ..పోలీసుల పదఘట్టనలు విన్పిస్తున్నాయి. దీనికి తోడుఅయ్యప్ప స్వామి ఆలయం ద్వారాలు తెరుచుకునే ఒక్క రోజు ముందు ఆ రాష్ట్ర మంత్రి చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.

సన్నిధానానికి వచ్చే మహిళలకు సెక్యూరిటీ కల్పించడం తమ వల్ల కాదంటూ చేతులెత్తేసారు. అసలు మీరు రాకుండా ఉంటేనే చాలు అదే పదివేలు మాకంటూ దండం పెట్టేశారు. కేరళ రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి కడకం పల్లి సురేంద్రన్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయ్..ప్రస్తుతం గుడికి మామూలు భద్రతే కల్పిస్తున్నామని…మహిళలు దర్శనానికి వచ్చేట్లైతే..అదనంగా సెక్యూరిటీ కావాలని..ఆ పని తమ వల్ల కాదంటూ
చెప్పారాయన. 

శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన రివ్యూ పిటీషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వకుండా..లార్జ్ బెంచ్‌కి రిఫర్ చేసింది.. దీంతో  అందరి దృష్టీ శబరిమల ఆలయంపైనే నిలిచింది. ఇప్పటికే 30మందికి పైగా మహిళలు అయప్ప ఆలయ దర్శనం కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న తరుణంలో తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓ వైపు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్..కోర్టు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలంటూ కోరారు. గత తీర్పు ప్రకారం ముందుకు వెళ్తామని చెప్పారు..ఈ క్రమంలో మంత్రి సురేంద్రన్ చేసిన వ్యాఖ్యలతో గందరగోళం నెలకొంది. మరోవైపు ఆలయం వద్ద సెక్యూరిటీని భారీగా పెంచారు.

మహిళలకు ప్రవేశంపై కోర్టు ప్రస్తుతానికి గత తీర్పుపై స్టే ఇవ్వలేదు..కాబట్టి..గత మాలధారణ  సీజన్‌లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో…ఇప్పుడు కూడా అవే సీన్లు కన్పించేందుకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయ్.  మంత్రి మాత్రం ఏకంగా దర్శనం కావాలంటే  మహిళలంతా సుప్రీంకోర్టుకే వెళ్లి తేల్చుకోవాలే గానీ, తమ రాష్ట్రానికి రావొద్దంటూ చెప్పారు. రాష్ట్రమంత్రే ఇలా చెప్తున్నప్పుడు ఆలయం వద్ద సిచ్యుయేషన్ ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి..ఇప్పటికే బిజెపి, కాంగ్రెస్‌లు మహిళల ప్రవేశంపై ఆంక్షలు కొనసాగాలంటూ కామెంట్ చేశాయి. 

అయితే ఇవే పార్టీలు కోర్టులో మాత్రం తీర్పు ప్రకారం నడుచుకుంటామంటూ చెప్పేవి..ఇలాంటి పరస్పర విరుద్ధ వైఖరులు..పరిణామాల మధ్య ఆలయ ద్వారాలు తొందర్లో తెరుచుకోబోతున్నాయ్. ఈ నేపధ్యంలోనే మొత్తం ఐదంచెలలో 10 వేల మందికిపైగా పోలీసులతో పహారా ఏర్పాటు చేయబోతున్నారు. నవంబర్  15 నుంచి 24 మంది ఎస్పీలు..24మంది అడిషనల్ ఎస్పీలు.., 112 డిప్యూటీ ఎస్పీలు, 264 మంది ఇన్ స్పెక్టర్లు, 1185 మంది సబ్ ఇన్ స్పెక్టర్లు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించబోతున్నారు.