Dhoni wife: ధోని భార్యకు కోపమొచ్చింది.. ట్విటర్ వేదికగా ఆ ప్రభుత్వాన్ని కడిగేసింది..

క్రికెట్ గురించి తెలిసిన వారికి ధోని అంటే తెలియని వారుండరు. ప్రపంచ క్రికెట్‌లోనే కూల్ కెప్టెన్ గుర్తింపు పొందాడు. అనూహ్య నిర్ణయాలతో ప్రత్యర్థులను మట్టికరిపించడంలో దోనీకి ఎవరు సాటిరారు. మ్యాచ్ ఎంతటి ఉత్కంఠ ....

Dhoni wife: ధోని భార్యకు కోపమొచ్చింది.. ట్విటర్ వేదికగా ఆ ప్రభుత్వాన్ని కడిగేసింది..

Dohni

Updated On : April 26, 2022 / 1:46 PM IST

Dhoni wife: క్రికెట్ గురించి తెలిసిన వారికి ధోని అంటే తెలియని వారుండరు. ప్రపంచ క్రికెట్‌లోనే కూల్ కెప్టెన్ గుర్తింపు పొందాడు. అనూహ్య నిర్ణయాలతో ప్రత్యర్థులను మట్టికరిపించడంలో దోనీకి ఎవరు సాటిరారు. మ్యాచ్ ఎంతటి ఉత్కంఠ భరితంగా సాగుతున్న ధోనీ మొఖంలో ప్రశాంతత అణువంతైనా తగ్గిపోదు. ఓడినా, గెలిచినా ఒకే విధంగా ఉండటం ధోనీ ప్రత్యేకత. కానీ ప్రస్తుతం ధోనీ సతీమణి సాక్షిసింగ్ ధోనీ మాత్రం తన ఆగ్రహానికి పనిచెప్పారు. ట్విటర్ వేదికగా తన కోపాన్ని మొత్తం ప్రభుత్వంపై వెల్లదీశారు. ఇంతకీ సాక్షిసింగ్ ధోనీకి ఎందుకంత కోపం వచ్చిందంటే..

ఝార్ఖండ్‌లో కొద్దిరోజులుగా చాలా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు మిట్ట మధ్యాహ్నం రోడ్లపైకొచ్చేందుకు జంకుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చూసుకుంటూ మధ్యాహ్నం ఇంట్లోనే సేదతీరేందుకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అయితే మధ్యాహ్నం సమయంలో ఝార్ఖండ్‌లో విద్యుత్ కోతలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాష్ట్ర రాజధాని రాంచీ, జంషెడ్‌పూర్ వంటి నగరాల్లో మినహా అన్ని నగరాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం సాక్షి సింగ్ ధోనీ కూతురుతో కలిసి రాంచీలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో విద్యుత్ అప్రకటిత కోతలు ఆమె ఆగ్రహానికి కారణమైంది.

Bihar Politics: లాలూ తనయుడు సంచలన నిర్ణయం.. వివాదానికి అసలు కారణమేంటి?

దీంతో ట్విటర్ వేదికగా సాక్షి సింగ్ ధోని ప్రభుత్వంపై విమర్శల దాడి చేసింది. ఒక ట్యాక్స్ పేయర్ గా ఝార్ఖండ్ ప్రభుత్వానికి ప్రశ్న వేస్తున్నా.. కొన్నేళ్ల నుంచి రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఇంతలా ఎందుకుందనేది తెలుసుకోవాలనుకుంటున్నాను, బాధ్యత కలిగిన పౌరులుగా విద్యుత్ ను ఆదాచేసేందుకు మేం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అయినా విద్యుత్ కోతలు ఎందుకు ఆగడం లేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఝార్ఖండ్ లో ముక్తి మోర్చా అధినేత హేమంత్ సోరెన్ సీఎంగా ఉన్నారు. అయితే సాక్షి సింగ్ ధోనీ ట్వీట్ కు ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికి ఎలాంటి స్పందన రాలేదు. అయితే నెటిజర్లు మాత్రం ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. కొందరు సాక్షికి మద్దతుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుండగా, మరికొందరు రాజకీయాల్లోకి ఏమైనా ట్రై చేస్తున్నారా అంటూ రీట్వీట్లు చేస్తున్నారు.