Bihar: మహిళలకు విద్య లేదు, పురుషులకు పట్టింపు లేదు.. జనాభా నియంత్రణపై నితీశ్ సంచలన వ్యాఖ్యలు
బిహార్లో మాత్రం ఆ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. నానాటికీ జనాభా పెరుగుతూనే ఉంది. ఇది రాజకీయంగా కూడా అక్కడ ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ఇకపోతే, తాజాగా ఈ విషయాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. అయితే దీనిపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ‘‘ముఖ్యమంత్రి ఉపయోగించే పదజాలమేనా అది?’’ అంటూ విపక్ష భారతీయ జనతా పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు.

When women are uneducated and men careless, Nitish Kumar’s remarks on population stirs row
Bihar: బిహార్ రాష్ట్ర జనాభా గురించి అందరికీ తెలిసిందే. జనసాంద్రత అతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో బిహార్ మొదటి స్థానంలో ఉంది. అయితే దేశంలో చాలా కాలంగా చేపడుతున్న జనాభా నియంత్రణ చర్యలు కొంత వరకు ఫలించి అనేక రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల కాస్త మందగించింది. కానీ, బిహార్లో మాత్రం ఆ ప్రభావం ఏమాత్రం కనిపించడం లేదు. నానాటికీ జనాభా పెరుగుతూనే ఉంది. ఇది రాజకీయంగా కూడా అక్కడ ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. ఇకపోతే, తాజాగా ఈ విషయాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్. అయితే దీనిపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. ‘‘ముఖ్యమంత్రి ఉపయోగించే పదజాలమేనా అది?’’ అంటూ విపక్ష భారతీయ జనతా పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు.
Encounter Two Terrorists Killed : జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
‘సమాధాన్ యాత్ర’లో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న నితీశ్.. తాజాగా వైశాలలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘మహిళలు చదువుకున్నప్పుడు మాత్రమే జనాభా పెరుగుదల అదుపులోకి వస్తుంది. కానీ మన రాష్ట్రంలో (బిహార్) అది ఇంకా అదుపులోకి రాలేదంటే మహిళలు విద్యలో చాలా వెనుకబడి ఉన్నారు. మహిళలకు ఉత్తమమైన చదువు ఉంటే, గర్భం నుంచి తమను తాము రక్షించుకుంటారు. మహిళలకంటే విద్య లేదు, అలాగే ఈ విషయంలో పురుషులకు పట్టింపు లేదు. మహిళలు విద్యావంతులు కావాలి. జనాభా పెరుగుదలను నిరోధించాలి’’ అని అన్నారు.
Bharat Jodo Yatra: గడ్డకట్టే చలిలో చొక్కాలు విప్పేసి డాన్సులు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
అయితే నితీశ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. బహిరంగ సభలో ఒక ముఖ్యమంత్రి ఇంతటి దారుణమైన పదజాలం ఉపయోగించడమేంటని ఆ పార్టీ నేత సామ్రాట్ చౌదరి మండిపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉపయోగించిన పదజాలం అసహనానికి తీవ్ర రూపం. ఇలాంటి పదాలతో ఆయన ముఖ్యమంత్రి పదవి గౌరవాన్ని దిగజార్చుతున్నారు’’ అని సామ్రాట్ చౌదరి అన్నారు.