Eyes Stabbed: మహిళ కళ్లలో పొడిచి అత్యాచారం

మహిళను అత్యాచారం చేయడంతో పాటు ఎదురుతిరిగిందని కళ్లలో పొడిచాడో వ్యక్తి. బీహార్ లోని కటిహార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 45ఏళ్ల మహిళ తనపై దాడికి పాల్పడిన వ్యక్తి.. ఆమె రెండు కళ్లలో పొడిచాడు.

Eyes Stabbed: మహిళ కళ్లలో పొడిచి అత్యాచారం

Roorkee Gangrape

Updated On : July 15, 2022 / 1:43 PM IST

 

 

Eyes Stabbed: మహిళను అత్యాచారం చేయడంతో పాటు ఎదురుతిరిగిందని కళ్లలో పొడిచాడో వ్యక్తి. బీహార్ లోని కటిహార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 45ఏళ్ల మహిళ తనపై దాడికి పాల్పడిన వ్యక్తి.. ఆమె రెండు కళ్లలో పొడిచాడు. బుధవారం జరిగిన ఈ ఘటనపై అహ్మదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మెడికల్ టెస్టుల అనంతరం పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు.

భర్త వేరే రాష్ట్రంలో పనిచేస్తుండగా మహిళ 11ఏళ్ల కూతురితో కలిసి నిద్రిస్తుంది. అదే సమయంలో పొరిగింటిలో ఉంటున్న మొహమ్మద్ షమీమ్ అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడి మహిళను ఎత్తుకుపోయాడు. రేప్ కు పాల్పడుతుండగా జరిగిన పెనుగులాటలో మేకు లాంటి వస్తువుతో ఆమె కళ్లలో పొడిచాడు.

స్థానికులు ఆమెను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆమె రెండు కళ్లకు గాయంకాగా, కొన్ని పరీక్షల అనంతరమే చూపు గురించి చెప్పగలమని స్పష్టం చేశారు.

Read Also : వివాహితపై అత్యాచారం కేసు.. కీచక ఖాకీపై సస్పెన్షన్ వేటు

అక్కడి నుంచి కటిహార్ లోని సదర్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. ఆమె రెటీనా డామేజ్ అయిందని, పత్తి సంచులు కుట్టే సూది లాంటిదానితో దాడి చేసి ఉండొచ్చని.. ఆమెకు చూపుకు రావడం కష్టమని తేల్చారు.