దిశ రవి ఎవరు? టూల్ కిట్ కేసు సంగతేంటి? ఎందుకు అరెస్ట్ చేశారు?

Who is Disha Ravi : స్వీడన్‌కు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బర్గ్‌కు రైతుల ఆందోళనకు సంబంధించిన టూల్ కిట్ షేర్ చేశారు. ఈ కేసులో బెంగళూరుకు చెందిన కార్యకర్త దిశ రవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ టూల్ కిట్ తయారీలో, జనవరి 26న జరిగిన హింసలో ప్రధాన కుట్రదారుగా పోలీసులు ఆరోపించారు. గ్రెటాతో పాటు మరికొందరు ఖలిస్థానీ పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్‌తో చేతులు కలిపారని పోలీసులు అనుమానిస్తున్నారు. దేశానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారని చెప్పారు. అదే టూల్ కిట్‌ను దిశ.. గ్రెటాకు పంపింది.
దివ రవి ఎవరంటే? :
22 ఏళ్ల దిశ రవి బెంగళూరులోని మౌంట్ కామెల్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ పేరుతో గ్రెటా థన్‌బర్గ్ ప్రారంభించింది. పర్యావరణ కార్యకర్తల గ్రూపులో ఈమె కూడా ఒక సభ్యురాలు. 2019లో ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఇండియా విభాగాన్ని ప్రారంభించింది. పర్యావరణ మార్పులపై పలు ప్రచారాలను చేపట్టింది. టూల్ కిట్ అనేది ఒక సోషల్ మీడియా డాక్యుమెంట్.
దిశ రవిని ఎందుకు అరెస్ట్ చేశారు?
ప్రస్తుతం దిశపై దేశద్రోహం, నేరపూరిత కుట్ర కేసులను ఢిల్లీ పోలీసులు నమోదు చేశారు. కోర్టు ఆమెకు 5 రోజుల పోలీసు కస్టడీ విధించింది. గ్రెటా థన్‌బర్గ్ ఈ టూల్‌కిట్‌ను పోస్ట్ చేస్తూ రైతుల ఆందోళనకు మద్దతు తెలిపింది. టూల్ కిట్‌ను ఇండియా బయట కూడా దేశానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అందులో ట్విటర్ కీలక పాత్ర పోషించిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ చెబుతోంది. దిశ రవిని పోలీసులు అరెస్ట్ చేయడాన్ని పలువురు ఖండించారు.