కరోనాతో తల్లిదండ్రులు చనిపోతే.. అనాథలుగా మారిన పిల్లలను..

కరోనాతో తల్లిదండ్రులు చనిపోతే.. అనాథలుగా మారిన పిల్లలను..

smriti-irani

Updated On : May 6, 2021 / 5:30 PM IST

కరోనావైరస్ దేశంలో వినాశనం క్రియేట్ చేస్తుంది. కరోనా సంక్రమణ కేసులు నిరంతరం పెరిగిపోతున్నాయి. కుటుంబాలు కకావికలం అవుతున్నాయి. ఘోరమైన వైరస్ కారణంగా, చాలా మంది ప్రజలు తమ కుటుంబాలను కోల్పోతున్నారు. అమాయకులైన పిల్లలు అనాధలు అవుతున్నారు. తల్లి తండ్రి నీడలను వైరస్ మింగేస్తుంది.

ఇటువంటి సమయంలో కొందరు పిల్లలను మానవత్వంతో అక్కున చేర్చుకుంటూ ఉండగా.. ఈ క్రమంలోనే పిల్లల అక్రమ రవాణాలు జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా కేంద్రం భావిస్తోంది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ‘కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు గురించి మీకు తెలిస్తే.. వారిని చూసుకోవటానికి ఎవరూ లేకుంటే, సదరు పిల్లలు గురించి జిల్లా పోలీసులు లేదా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. చైల్డ్ లైన్ 1098ను సంప్రదించి వారికి సమాచారం ఇవ్వడం మీ చట్టపరమైన బాధ్యత అని ఆమె వెల్లడించారు.

‘మనమందరం దత్తత చట్టబద్ధంగా ఉండేలా చూడాలి, లేకపోతే పిల్లలను దత్తత పేరిట అక్రమ రవాణా చేయవచ్చు. చైల్డ్ లేబర్‌గా మార్చవచ్చు. మన పిల్లలను మనమే సేవ్ చేసుకోవాలి. మీరు అలాంటి పిల్లలను చూసినట్లయితే పోలీసులకు, శిశు సంక్షేమ కమిటీకి లేదా చైల్డ్‌లైన్ 1098కు తెలియజేయండి.

‘పిల్లల చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు’:
స్మృతి ఇరానీ ప్రజలను మరింతగా విజ్ఞప్తి చేశారు, ‘దయచేసి సంక్షోభ సమయంలో పిల్లల చిత్రాలను.. కాంటాక్ట్ వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవద్దని సూచించారు. వారిని గుర్తింపు చట్టం ప్రకారం రక్షించబడాలి. బదులుగా, పోలీసులకు, శిశు సంక్షేమ కమిటీకి లేదా చైల్డ్‌లైన్ 1098కు తెలియజేయాలని ఆమె కోరారు.