ఎవరీ బాబా సిద్ధిఖీ.. ఆయనకు అంత గుర్తింపు ఎలా వచ్చింది?
బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ తమ ఐదేళ్ల వైరాన్ని ఒక్క హగ్‌తో ముగించడంలో 2013లో సిద్ధిఖీ ఇచ్చిన ఇఫ్తార్ పార్టీనే కారణం.

బాంద్రా మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ (66) దారుణంగా హత్యకు గురైన విషయం తెలిసిందే. అసలు ఎవరీ సిద్ధిఖీ? ఆయనకు బాలీవుడ్‌కి, మహారాష్ట్ర రాజకీయాలకు, ప్రజలకు ఉన్న సంబంధం ఏంటి?
సిద్ధిఖీ ఇఫ్తార్ పార్టీలు ఇవ్వడంలోనూ పేరుగాంచారు. బాలీవుడ్ స్టార్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ తమ ఐదేళ్ల వైరాన్ని ఒక్క హగ్‌తో ముగించడంలో 2013లో సిద్ధిఖీ ఇచ్చిన ఇఫ్తార్ పార్టీనే కారణం. ఆ ఈవెంట్‌లోనే షారుక్, సల్మాన్ కలిసిపోయారు. వారిద్దరినీ మళ్లీ కలిపిన ఘనత సిద్ధిఖీకే దక్కుతుంది. సిద్ధిఖీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కాంగ్రెస్‌ను వీడి అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరారు.
ఎన్నో బాధ్యతల్లో..
మహారాష్ట్రలోని ముఖ్య రాజకీయ నేతలల్లో సిద్ధిఖీ ఒకరు. గతంలో ఆయన మహారాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు, కార్మిక శాఖ, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ సహాయ మంత్రిగానూ పనిచేశారు. రాజకీయ, సామాజిక కార్యక్రమంగా మారిన గ్రాండ్ ఇఫ్తార్ పార్టీలకు ఆతిథ్యం ఇవ్వడంలో బాగా ప్రసిద్ధి చెందారు.
ఆయన బాంద్రా వెస్ట్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సిద్ధిఖీ తల్లిదండ్రుల పేర్లు అబ్దుల్ రహీం, రజియా సిద్ధిఖీ. ఆయన భార్య పేరు షెహజీన్ సిద్ధిఖీ. వారికి డాక్టర్ అర్షియా సిద్దిఖీ, జీషన్ సిద్దిఖీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని కుమారుడు జీషన్ కూడా రాజకీయ నాయకుడు. జీషన్ ముంబైలోని బాంద్రా ఈస్ట్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
సిద్ధిఖీ రాజకీయ ప్రయాణం 1977లో కాంగ్రెస్‌లో చేరడంతో ప్రారంభమైంది. 1980 నాటికి ఆయన బాంద్రా తాలూకా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1982లో ఆయన ఒక దశాబ్దం పాటు బాంద్రా తాలూకా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. 1988లో ముంబై యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
1992లో సిద్ధిఖీ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ లో మునిసిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 1999 నుంచి ఎమ్మెల్యేగా వరుసగా మూడు పర్యాయాలు గెలిచారు. 2000 నుండి 2004 వరకు సిద్ధిఖీ మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ముంబై బోర్డు ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.
బాబా సిద్ధిఖీని చంపింది మేమే.. బిష్ణోయ్ గ్యాంగ్ పోస్టు వైరల్.. సల్మాన్ గురించి ప్రస్తావన..