Maharashtra Politics: జోలె పట్టుకుని వెళ్తారు, జనాల చేతిలో చిప్ప పెడతారు.. మోదీపై ఉద్ధవ్ థాకరే ఘాటు వ్యాఖ్యలు

‘‘ప్రజల్లోకి వెళ్లి నిలబడదాం. ఎవరి బలాలు ఏంటో తెలుస్తుంది. అసలైన శివసేన ఎవరిదంటే పాకిస్తాన్‭ అయినా చెప్తుంది’’ అని అన్నారు. వాస్తవానికి నిజమైన శివసేన ఎవరిదో సుప్రీంకోర్టు చెప్పలేకపోతోందని, మోదీ-షాల ఒత్తిడి వల్ల అలా జరుగుతోందని ఉద్ధవ్ థాకరే అన్నారు

Maharashtra Politics: జోలె పట్టుకుని వెళ్తారు, జనాల చేతిలో చిప్ప పెడతారు.. మోదీపై ఉద్ధవ్ థాకరే ఘాటు వ్యాఖ్యలు

Uddhav Thackeray

Updated On : April 24, 2023 / 1:08 PM IST

Maharashtra Politics: వారసత్వ, కుటుంబ రాజకీయాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తరుచూ విమర్శలు చేస్తుంటారు. అయితే బీజేపీ ప్రతిపక్షమైన శివసేన.. మోదీ పేరు ప్రస్తావించకుండా ఈ విమర్శలపై ఘాటుగా స్పందించారు. వారసత్వ రాజకీయాలను ఒక్కోసారి స్వాగతించొచ్చని, అయితే ఫకీర్లను మాత్రం నమ్మలేమంటూ మండిపడ్డారు. వారసత్వ రాజకీయాల్లో కొన్ని సంప్రదాయాలు అయినా వస్తాయని, కానీ ఫకీర్ జోలె తీసుకుని వెళ్లి ప్రజల చేతిలో చిప్ప పెడతారంటూ ఉద్ధవ్ థాకరే ఎద్దేవా చేశారు.

Madhya Pradesh: సామూహిక వివాహాలు చేస్తే చేశారు.. కానీ పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ టెస్టులేంటి?

‘‘కుటుంబ రాజకీయాలని, వారసత్వ రాజకీయాలని అన్ని సార్లు వ్యతిరేకంగా చూడలేం. కొన్నిసార్లు అవి కూడా బాగుంటాయి. వాటిని కూడా స్వాగతించొచ్చు. ఎందుకంటే అలాంటి రాజకీయాల్లో కొన్ని బలమైన సంప్రదాయాలు ఉంటాయి. కానీ, ఫకీర్ల పరిస్థితి ఏంటి? జోలె పట్టుకుని బయటికి వెళ్తారు. ప్రజల చేతిలో చిప్ప పెడతారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో వీరిని అసలే నమ్మొద్దు’’ అని ఉద్ధవ్ థాకరే అన్నారు.

Russia-Ukraine War: పుతిన్ చావు కోరుకుంటున్న ఉక్రెయిన్.. ముఖం మీదే చెప్పేశారు

ఇక అసలైన శివసేన ఎవరిదనే వివాదంపై ఆయన స్పందిస్తూ ‘‘ప్రజల్లోకి వెళ్లి నిలబడదాం. ఎవరి బలాలు ఏంటో తెలుస్తుంది. అసలైన శివసేన ఎవరిదంటే పాకిస్తాన్‭ అయినా చెప్తుంది’’ అని అన్నారు. వాస్తవానికి నిజమైన శివసేన ఎవరిదో సుప్రీంకోర్టు చెప్పలేకపోతోందని, మోదీ-షాల ఒత్తిడి వల్ల అలా జరుగుతోందని ఉద్ధవ్ థాకరే అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు అసలైన శివసేనే గెలిపిస్తారని, మోసకారులను పక్కన పెడతారని అన్నారు.