Russia-Ukraine War: పుతిన్ చావు కోరుకుంటున్న ఉక్రెయిన్.. ముఖం మీదే చెప్పేశారు

రష్యా, ఉక్రెయిన్ మధ్య 14 నెలలుగా యుద్ధం జరుగుతోంది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా మొదటిసారి దాడి చేసింది. చూస్తుండగానే ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్రమైంది. యుద్ధ విమానాలు, పెద్ద బాంబులు జారవిడుచుకునేంత వరకు వెళ్లాయి.

Russia-Ukraine War: పుతిన్ చావు కోరుకుంటున్న ఉక్రెయిన్.. ముఖం మీదే చెప్పేశారు

Vladimir Putin

Russia-Ukraine War: ఎంత వైరం ఉన్నా.. ఎదుటి వారి చావు కోరకూడదు అంటారు. కానీ ఉక్రెయిన్ మాత్రం తమ ప్రత్యర్థి చావు కోరుతానంటోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చనిపోతే తాము సంతోషిస్తామని బ్రిటన్‌లో ఉక్రెయిన్ రాయబారి వాడిమ్ ప్రిస్టికో అన్నారు. వాస్తవానికి ఇలా కోరుకోకూడదని అంటూనే పుతిన్ చావును మాత్రం తప్పకుండా కోరుకుంటున్నామని అనడం విశేషం. ఇక పుతిన్ మీద విమర్శలతో తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. పుతిన్ అంతటి మేధావి ఏమీ కాదని, సంక్లిష్టమైన రష్యన్ రాజకీయ వ్యవస్థను విశ్వసించే అవినీతి మానవుడని దుయ్యబట్టారు.

Madhya Pradesh: సామూహిక వివాహాలు చేస్తే చేశారు.. కానీ పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ టెస్టులేంటి?

ఏప్రిల్ 21న ‘న్యూస్‌వీక్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రిస్టికో ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘పుతిన్ చనిపోతే మేం సంతోషంగా ఉంటాము. ఖచ్చితంగా సంతోషంగా ఉంటాము. సాధారణంగా ఏ మనిషికీ మరణం రావాలని కోరుకోకూడదు. కానీ మేము మాత్రం ఈ వ్యక్తి చనిపోవాలని కోరుకుంటున్నాం. ఎక్కడ పావులు తీయాలో పుతిన్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక రష్యా ప్రజలకు వారి సొంత ఆసక్తులు వారికి ఉన్నాయి. వారికి వారి సొంతత ప్రధాన సమూహాలూ ఉన్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు పూర్తి మద్దతు లేదు. అతడికి మిత్రులతో పాటు శత్రువులు కూడా చాలా మందే ఉన్నారు’’ అని ప్రిస్టికో అన్నారు.

14 నెలలుగా సాగుతోన్న యుద్ధం
రష్యా, ఉక్రెయిన్ మధ్య 14 నెలలుగా యుద్ధం జరుగుతోంది. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా మొదటిసారి దాడి చేసింది. చూస్తుండగానే ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్రమైంది. యుద్ధ విమానాలు, పెద్ద బాంబులు జారవిడుచుకునేంత వరకు వెళ్లాయి. కొద్ది రోజులకు ఇరు దేశాలు తమదే విజయం అంటే తమదే విజయం అని ప్రకటనలు చేశాయి. అయినప్పటికీ యుద్ధం మాత్రం ఆగలేదు. మునుపటంతటి తీవ్ర స్థాయిలో లేకపోయినప్పటికీ.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.