New Zika Virus : కాన్పూర్‌లో 100 మార్క్ దాటిన జికా వైరస్.. కొత్తగా మరో 16 కేసులు!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జికావైరస్ విజృంభిస్తోంది. కాన్పూర్‌లో జికా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కాన్పూర్ సిటీలో జికా వైరస్ కేసుల సంఖ్య 100 మార్క్ దాటేసింది.

With 16 New Zika Virus Cases, Kanpur Crosses 100 Mark
Kanpur Zika Virus Cases : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జికావైరస్ విజృంభిస్తోంది. కాన్పూర్‌లో జికా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. కాన్పూర్ సిటీలో జికా వైరస్ కేసుల సంఖ్య 100 మార్క్ దాటేసింది. బుధవారం (నవంబర్ 10) కొత్తగా 16 జికా వైరస్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తంగా జికా వైరస్ బాధిత కేసులు 106కు చేరుకున్నాయి. జికా బారినపడినవారిలో 9 మంది పురుషులు ఉండగా.. ఏడుగురు మహిళలు ఉన్నారు. రాష్ట్రంలో జికావైరస్ కేసులు అధికమవుతుండటంతో వైరస్ కట్టడికి యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
హరిజిందర్ నగర్, తివారిపుర్, పోకార్పూర్, బగియా, ఖాజీ ఖేరా ప్రాంతాలకు చెందినవారికి కొత్తగా జికావైరస్ వ్యాపించింది. వైరస్ పరీక్షల్లో వారికి పాజిటివ్‌గా తేలింది. ఇక గర్భిణులకు కూడా ఆల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించారు. గర్భిణుల పిండాలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు ద్రువీకరించారు. కొత్తగా జికా వచ్చిన వారిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచినట్టు యూపీ వైద్యాధికారులు వెల్లడించారు. చాలా వరకు పేషెంట్లలో ఎలాంటి లక్షణాలను గుర్తించలేదు. డోర్ టు డోర్ సర్వే చేపడుతున్నారు. గర్భిణులు పిండాల్లో ఏదైనా లోపం గమనిస్తే, తక్షణమే రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం సూచనలు చేస్తోంది.
అయితే ప్రస్తుత పరిస్థితిని సమీక్షించేందుకు కాన్పూర్‌లో సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటించనున్నారు. జిల్లా అధికార యంత్రాంగంతో వైరస్ కేసుల కట్టడిపై సీఎం యోగి సమావేశం నిర్వహించనున్నారు. జికా వైరస్ సంక్రమణను నివారించడానికి మార్గదర్శకాలను అధికారులు జారీ చేయనున్నారు. ఇప్పటికే జికా వైరస్‌పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను పురపాలక శాఖ నిర్వహిస్తోంది.
Read Also : Naatu Naatu Song : దుమ్ములేపి దమ్ము చూపిన డాన్సర్లు.. చెర్రీ, NTR ఫ్యాన్స్‌కు అసలైన దీపావళి