ఛాయ్‌లో చికెన్ టిక్కా తింటే ఎలా ఉంటుంది

  • Published By: madhu ,Published On : January 5, 2020 / 04:58 AM IST
ఛాయ్‌లో చికెన్ టిక్కా తింటే ఎలా ఉంటుంది

Updated On : January 5, 2020 / 4:58 AM IST

ఛీ..ఏంటీ ఇది..ఛాయ్‌లో రొట్టె..బిస్కెట్ వేసుకుని తింటారు..కానీ ఇదేంది..చికెట్ టిక్కా అనుకుంటున్నారా ? ఓ మహిళ..ఛాయ్‌లో చికెట్ టిక్కా ముక్కలు వేసుకుని స్పూన్ సహాయంతో తిన్న వీడియో నెటిజన్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన వారు..అసహ్యించుకుంటున్నారు. 

ఉదయాన్నే లేవగానే చాలా మందికి ఛాయ్ అలవాటు. ఛాయ్ తాగందే..కొంతమంది ఉండరు. అలాగే..మాంసాహారాల్లో చికెన్ ఒకటి. దీనితో ఎన్నో వంటలు తయారు చేస్తుంటారు. @pocoschick పేరిట ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో ఓ కప్‌లో నాలుగు చికెన్ టిక్కాలున్నాయి. తర్వాత ఛాయ్ పోసుకుని తినడం ఉంది. ‘హై గైస్..టీ, ఇడ్లీ వీడియోను పోస్టు చేసిన సమయంలో తందూరీ లెగ్ ప్రయత్నించాలని కోరడం జరిగిందని పోస్టులో పేర్కొన్నారు.

కానీ లెగ్ పీస్ దొరకలేదు..కానీ చికెన్ టిక్కా దొరికింది. దీనిని ఛాయ్‌లో వేసుకుని తింటుంటే..బాగా రుచిగా ఉంది. 
దీనిని చూసిన నెటిజన్లు అసహ్యించుకున్నారు. సాంబార్‌లో జిలేబీ వేసుకుని తినని ఓ నెటిజన్ వెల్లడించాడు. 2020 ప్రారంభంలో అసహ్యమైందని మరో నెటిజన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది. 
 

Hey, Guys! When I posted the tea & idli video, u/wromit suggested that I should try “tandoori leg” with tea. I couldn’t find a leg piece, but I found what they call “Tikka.” At first, I wasn’t too sure about it, but after I tried it, I’m really digging the flavor. The after-taste was decent. from r/india