Woman : కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన మహిళ.. కాపాడిన రైల్వే కానిస్టేబుల్

ఫాతిమా ఖాతూన్, ఆమె బంధువు పరుగెత్తుతూ ప్లాట్‌ఫారమ్ నెంబర్ 4 నుండి బయలుదేరుతున్న హౌరా-తారకేశ్వర్ లోకల్ రైలును ఎక్కడానికి ప్రయత్నించారు. రైలు లోపలికి వెళ్లే తొందరలో ఆమె బంధువు ఫాతిమా ఖాతూన్ ను రైలు డోర్‌లోకి నెట్టాడు.

Woman : కదులుతున్న రైలు ఎక్కుతూ జారిపడిన మహిళ.. కాపాడిన రైల్వే కానిస్టేబుల్

Railway Police Save Woman

Updated On : November 30, 2023 / 2:32 PM IST

Woman Slips While Boarding Train : పశ్చిమ బెంగాల్‌లో రైలు ఎక్కుతూ జారిపడిన మహిళను ఓ పోలీసు అధికారి రక్షించారు. హౌరాలో బుధవారం ఉదయం మహిళ రైలు ఎక్కుతూ జారి పడిపోవడంతో రైల్వే కానిస్టేబుల్ అప్రమత్తమై ఆమె ప్రాణాలను కాపాడారు. ఈ ఘటన హౌరా స్టేషన్ ఓల్డ్ కాంప్లెక్స్ స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

బుధవారం ఉదయం 10.50 గంటలకు 40 ఏళ్ల ఫాతిమా ఖాతూన్, ఆమె బంధువు పరుగెత్తుతూ ప్లాట్‌ఫారమ్ నెంబర్ 4 నుండి బయలుదేరుతున్న హౌరా-తారకేశ్వర్ లోకల్ రైలును ఎక్కడానికి ప్రయత్నించారు. రైలు లోపలికి వెళ్లే తొందరలో ఆమె బంధువు ఫాతిమా ఖాతూన్ ను రైలు డోర్‌లోకి నెట్టాడు.

United States : 2 గంటలపాటు 20 టన్నుల చెత్తలో వెతుకులాట..దేనికోసమో తెలుసా?

అతను అకస్మాత్తుగా నెట్టడంతో ఆమె బ్యాలెన్స్ కోల్పోయి జారి ప్లాట్‌ఫారమ్‌పై పడబోయారు. రైలు డోర్‌కి ఫాతిమా వేలాడుతూ కనిపించింది. రైలు వేగం పెరగడంతో బంధువు ఆమెను రైలు కింద పడకుండా లాగేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె రైలు, ప్లాట్‌ఫారమ్ మధ్య గ్యాప్‌లో చిక్కుకుకుపోయారు.

ఇది చూసిన రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎల్‌కే బౌరీ వెంటనే ఆ ఇద్దరి వైపు పరుగెత్తుకెళ్లాడు. ఆమె చేయి పట్టుకుని వేగంగా వెళ్తున్న రైలు నుండి దూరంగా లాగి ఆమె ప్రాణాలను కాపాడాడు. ఫాతిమాను రక్షించడానికి ప్రయత్నించిన పోలీసులకు సహాయం చేయడానికి ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న పలువురు ప్రయాణికులు పరిగెత్తిన దృశ్యాలు కూడా సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి.

High Court : ఎస్ఐ నియామకాలపై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు

వెంటనే అప్రమత్తమై వేగంగా పరుగెత్తి మహిళను రక్షించిన పోలీసు అధికారిని ఈస్టర్న్ రైల్వేస్ మెచ్చుకుంది. డ్యూటీలో ఉన్న తూర్పు రైల్వే ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్, హౌరా నార్త్‌కు చెందిన ఎల్కే బౌరీ అద్భుతంగా స్పందించారు. అతను ఫ్లామ్ ఫామ్, రైలు మధ్య పడబోతున్న మహిళను బయటకు లాగి ఆమె ప్రాణాలు కాపాడరని ఒక ప్రకటనలో తెలిపింది. కానిస్టేబుల్ చేసిన సహాయానికి ప్రయాణికుడు కృతజ్ఞతలు తెలుపుతూ మరో రైలులో సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చినట్లు రైల్వే తెలిపింది.