Bengaluru : చీరల షాపులో చితక్కొట్టుకున్న మహిళలు .. సిగపట్లతో రాద్ధాంతం
చీరల కోసం మహిళలు చితక్కొట్టుకున్నారు. చీరల షాపులో సిగపట్లతో నానా రాద్ధాంతం చేశారు.

womens fight over saree
Bengaluru: చీరలపై భారీ తగ్గింపు అని బోర్డు చూస్తే అతివలు ఆగుతారా? ఎగబడి మరీ గుంపులు గుంపులుగా వచ్చిపడతారు. అటువంటి ప్రకటన గురించి తెలిసి భారీగా తరలి వచ్చారు మహిళలు. బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో చీరలపై భారీ తగ్గింపు ప్రకటన చూసి మహిళలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఆ షాపుల ముందు క్యూ కట్టారు. నచ్చిన చీరల కోసం మహిళలు సెలక్ట్ చేసుకోవటంలో బిజీ బిజీగా ఉన్నారు. అలా మనకు నచ్చిన చీర మరో మహిళ తీసేసుకుంటే అయ్యో ఆ చీర ఎంతబాగుంది..కానీ ఆమె తీసేసుకుందే అని తెగ బాధపడిపోతాం. వీలైతే అలాంటి చీర మరొకటి ఉంటే ఇవ్వమని అక్కడుండే సేల్స్ వాళ్లను అడుగుతాం. లేదంటే ఉస్సూరుముంటాం.
బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో‘మైసూరు సిల్క్ చీర వార్షిక విక్రయం’ అని ప్రకటించారు. దీంతో భారీగా తరలి వచ్చారు మహిళలు. షాపు కిక్కిరిపోయింది మహిళలతో. అలా ఎవరికి వారు చీరలు సెలక్ట్ చేసుకోవటంలో బిజీ బిజీగా ఉన్న సమయంలో అక్కడ ఎవ్వరు ఊహించని ఘటన జరిగింది.ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఇద్దరు మహిళలకు గొడవ వచ్చింది. అంతే.. ఇక సిగపట్లతో కుమ్మేసుకున్నారు. అందరూ చూస్తున్నారనే విచక్షణ కూడా లేకుండా ఇద్దరు సిగపట్లతో నానా యాగీ చేసిపారేశారు.
ఇద్దరు జుట్లు పట్టుకుని కొట్టేసుకున్నారు. దీంతో అక్కడున్న మహిళలు చీరలు సెలక్ట్ చేసుకోవటం మానేసి వారిద్దరు కొట్టుకోవటాన్ని చూస్తుండిపోయారు. ఆ ఇద్దరు మహిళలను ఆపటానికి సెక్యూరిటీ సిబ్బంది నానా పాట్లు పడ్డారు. అయినా వారు ఆగలేదు. వచ్చి ఆపినా ఆగలేదు. ఈ బాగోతాన్ని అక్కడే ఒకరు సెల్ ఫోన్‌లో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో ఓ మహిళ మరో మహిళను చెప్పుతో కొట్టినట్లుగా కనిపిస్తోంది. పదే పదే కొట్టటంతో ఆమె కూడా రెచ్చిపోయింది. జుట్టు పట్టుకుని ఈడ్చి ఈడ్చి కొట్టింది. సెక్యూరిటీ సిబ్బంది ఆపినా ఆగలేదు. ఇంత జరుగుతున్నా చాలామంది చీరలు సెలక్ట్ చేసుకోవటంలో బిజీగా ఉండిపోయారు. అక్కడ జరిగేది ఏమీ పట్టించుకోలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Mysore silk saree yearly sale @Malleshwaram .. two customers fighting over for a saree.??♀️RT pic.twitter.com/4io5fiYay0
— RVAIDYA2000 ?️ (@rvaidya2000) April 23, 2023