Priya Malik Gold : భారత్‌కు బంగారు పతకం.. మీరాబాయి చాను సిల్వర్ సాధించిన తర్వాతి రోజే

టోక్యో ఒలింపిక్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతం గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో క్రీడా వేదికగా ఓ యువతి బంగారు పతకం గెలిచి భారత దేశ పతాకాన్ని రెపరెపలాడించింది.

Priya Malik Gold : భారత్‌కు బంగారు పతకం.. మీరాబాయి చాను సిల్వర్ సాధించిన తర్వాతి రోజే

Priya Malik Gold

Updated On : July 25, 2021 / 2:25 PM IST

Priya Malik Gold : టోక్యో ఒలింపిక్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజతం గెలిచి దేశానికి గర్వకారణంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో క్రీడా వేదికగా ఓ యువతి బంగారు పతకం గెలిచి భారత దేశ పతాకాన్ని రెపరెపలాడించింది. భారత రెజ్లర్ ప్రియా మాలిక్ సంచలనం సృష్టించింది. వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి చరిత్ర నమోదు చేసింది. హంగేరీ రాజధాని బుడాపెస్ట్ లో జరుగుతున్న ఈ రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఫైనల్‌లో విజయం సాధించి ప్రియా మాలిక్ పసిడి కైవసం చేసుకుంది.

టోక్యో ఒలింపిక్స్‌లో మీరాభాయ్ చాను రజతం గెలిచిన తర్వాతి రోజే, మరో ప్రపంచ క్రీడా వేదికపై భారత మహిళా అథ్లెట్లు సత్తా చాటడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారత రెజ్లర్లపై భారీ అంచనాలే ఉన్నాయి. 57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా పురుషుల జాబితాలో పోటీ పడనుండగా మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగర్, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు.