బెంగళూరులో సూపర్ బైక్ మీద 300 కిలోమీటర్ల స్పీడ్..చివరకు దొరికిపోయాడు.

  • Published By: madhu ,Published On : July 22, 2020 / 07:06 AM IST
బెంగళూరులో సూపర్ బైక్ మీద 300 కిలోమీటర్ల స్పీడ్..చివరకు దొరికిపోయాడు.

Updated On : July 22, 2020 / 9:24 AM IST

చేతిలో బండి ఉంటే చాలు..రయ్ రయ్ అంటూ కుర్రకారు దూసుకపోతుంటారు. ఖాళీగా రోడ్డు ఉన్నా..లేకున్నా..తమ బైక్ లను ఇష్టమొచ్చినట్లుగా పోనిస్తూ..ఇతరులకు ఇబ్బంది పెడుతుంటారు. ఇలాగే..ఓ వ్యక్తి…చేశాడు. Yamaha R1 బైక్ పై యమస్పీడుగా పోనిచ్చాడు.

నేను ఎళా వెళుతున్నానో చూడండి..అంటూ స్వయంగా వీడియో కూడా తీసుకున్నాడు. అత్యంత వేగంతో దూసుకెళుతున్న ఇతడిని చూసిన వారు నోరెళ్లబెట్టారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసుకున్నాడు. ఇంకేముంది పోలీసులు సీన్ లోకి వచ్చారు. ఆ వ్యక్తిని అరెస్టు చేసి..బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన బెంగళూరు నగరంలో చోటు చేసుకుంది.

బెంగళూరులోని 13 కిలోమీటర్ల పొడవైన ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లై ఓవర్ పై ఓ వ్యక్తి Yamaha R1 1000 సీసీ బైక్ష పై దూసుకపోయాడు. ఏకంగా…గంటకు 299 కిలోమీటర్ల వేగంతో రాకెట్ లా వెళ్లిపోయాడు. అతడి వేగానికి అందరూ భయపడ్డారు. రెండు లైన్లు ఉన్న రోడ్డుపై ఎదురుగా వాహనాలు కూడా వస్తున్నాయి. కానీ..అతను మాత్రం స్పీడును ఏ మాత్రం తగ్గించలేదు.

దీంతో..ఇతరులను ప్రమాదంలో పడేసింది. ప్రమాదవశాత్తు ఎవరినైనా ఢీ కొడితే..భారీ ప్రమాదం కలిగేది. ఈ వీడియోను స్వయంగా బైకర్ రికార్డు చేశాడు. ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశాడు. అనంతరం ఇది వైరల్ గా మారిపోయింది. అయితే..ఇది ఎప్పుడు రికార్డు చేశాడో తెలియడం లేదు.

ఇతను ఎవరు అని వేట ప్రారంభించిన సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులు…29 ఏళ్ల మునియప్పను అరెస్టు చేసి 1000 సీసీ బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసును బెంగళూరు ట్రాఫిక్ పోలీసులకు అప్పగించినట్లు పోలీస్ జాయింట్ కమిషనర్ (క్రైం) సందీప్ పాటిల్ వెల్లడించారు.