BS Yediyurappa : యడియూరప్ప రాజకీయ ప్రస్థానం.. చివరి రెండేళ్లు అగ్నిపరీక్షే..

కర్ణాటక సీఎం యడియూరప్ప తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం రాష్ట్ర గవర్నర్ కి అందించారు. ఈ నేపథ్యంలోనే తన జీవిత విశేషాలు.. రాజకీయాల గురించి ఓ సారి తెలుసుకుందాం

బీ.ఎస్ యడియూరప్ప సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. 2019లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యడియూరప్ప రెండేళ్లపాటు తన సేవలు అందించారు. ఇక రాజీనామా నేపథ్యంలో ఆయన జీవితంలోని కొన్ని విషయాలు విశేషాలను తెలుసుకుందాం..

యడియూరప్ప తన రాజకీయ జీవితం జనసంఘ్ నుంచి ప్రారంభించారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో జైలు శిక్ష అనుభవించారు. కర్ణాటకలోని లింగాయత్ వర్గానికి చెందిన యడియూరప్ప దక్షిణ భారతదేశంలోనే తోలి బీజేపీ ముఖ్యమంత్రి. కర్ణాటకలో 20 శాతం ఓట్లు ఉన్న లింగాయత్ సామాజిక వర్గంలో బలమైన నేత యడియూరప్ప.

యడియూరప్ప జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం

యడ్యూరప్ప (యడియూరప్ప) 1943 ఫిబ్రవరి 27వ తేదీన కర్ణాటక రాష్ట్రం మాండ్యా జిల్లాలోని బూకనాకెరెలో జన్మించారు. చిన్నతనంలోనే ఆర్ఎస్ఎస్ లో చేరాడు. ఓ వైపు చదువుకుంటూనే మరో వైపు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనే వారు. ఆలా సంఘ్ తో మంచి అనుబంధం ఏర్పడింది. ఆయన పనితీరు గమనించిన సంఘ్ పెద్దలు 1970లో శికరిపూర్ శాఖకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యదర్శిగా నియమించారు. ఆ తర్వాత రెండేళ్లకే తాలుకా శాఖకు జనసంఘ్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఎమర్జెన్సీ సమయంలో జైలు జీవితం గడిపారు యడియూరప్ప.

రాజకీయ జీవితం

యడియూరప్ప 1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావంతో శికరిపూర్ తాలూకు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నియమించబడ్డారు. 1988లో కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 1983లో తొలిసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగారు. శికరిపూర్ శాసనసభ నుంచి బరిలో దిగి విజయం సాధించి తొలిసారి కర్ణాటక శాసనసభలో అడుగుపెట్టారు. ఇదే నియోజకవర్గం నుంచి 8 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు యడ్డి.. నాలుగు పర్యాయాలు కర్ణాటక ముఖ్యమంత్రిగా సేవలందించారు.

బీజేపీకి రాజీనామా

2012లో జాతీయ నాయకులతో విభేదాలు రావడంతో ఆయన బీజేపీని వీడి కర్ణాటక జనతా పార్టీని ఏర్పాటు చేశారు. 2013 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేజేపీ బరిలో దిగింది. కేవలం 8 చోట్ల మాత్రమే విజయం సాధించింది. ఒంటరిగా విజయం కష్టమని భావించిన యడియూరప్ప తిరిగి బీజేపీలో జాయిన్ అయ్యారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలుపు అంచుల వరకు తీసుకొచ్చారు. కానీ కాంగ్రెస్ జీడీఎస్ పొత్తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారడంతో వారి మధ్య విభేదాలు వచ్చి ప్రభుత్వం కూలిపోయింది. దీంతో 2019తో కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

సీఎం పదవికి రాజీనామా

బీజేపీలో వయసు నిబంధన ఉంది. 75 ఏళ్ళు దాటిన వారు రాజకీయ నుంచి తప్పుకోవాలని మోదీ, అమిత్ షా ద్వయం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే 75+ నేతలను తప్పిస్తుంది.. తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో కూడా వృద్ధ నేతలకు ఉద్వాసన పలికింది. ఈ నేపథ్యంలోనే నలుగురు మంత్రులతో రాజీనామా చేయించింది ఆ పార్టీ. ఇక యడియూరప్పకు కూడా 75 ఏళ్ళు దాటాయి. ప్రస్తుతం ఆయనకు 79 ఏళ్ళు.. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఈ ఫార్ములాను ఉపయోగించి తప్పించినట్లు సమాచారం. తాజాగా కేంద్ర పెద్దలతో భేటీ అయిన యడ్డి దీనిపై చర్చించారని వార్తలు వచ్చాయి.

 

గడిచిన రెండేళ్ల పాలన

2019 జులై 26 తేదీ యడియూరప్ప కర్ణాటక సీఎంగా నాలుగవసారి బాధ్యత తీసుకున్నారు. ఆయన సీఎం పీఠం ఎక్కిన నెల రోజుల్లోనే కర్ణాటకను వర్షాలు ముంచెత్తాయి. 10 జిల్లాకు వర్షాల దెబ్బకు తీవ్రగా నష్టపోయాయి. అప్పటికి యడియూరప్ప మంత్రివర్గం కూడా ఏర్పాటు చేసుకోలేదు. అతనొక్కడే వరదాప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాల వలన 38 వేలకోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని కేంద్రానికి నివేదిక పంపారు. అయితే కేంద్ర మాత్రం 1809 కోట్ల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఇక గతేడాది సెప్టెంబర్ లో మరోసారి బారి వర్షాలు కురిసాయి.. ఈ వర్షాలకు 15 జిల్లాలోని 157 తాలూకాలు నష్టపోయాయి.. అప్పుడు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో తిరిగి నష్టం అంచనా వేసి కేంద్రానికి పంపారు. కేంద్ర కేవలం 890 కోట్ల రూపాయలు మాత్రమే అందించింది. దీంతో యడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ఇంతలోనే కరోనా మహమ్మారి కట్టి దెబ్బకొట్టింది. ప్రకృతి విపత్తులు, కరోనా కష్టాలు సీఎంగా ఉన్న ప్రశాంత లేకుండా గడిచిపోయాయి.

 

ట్రెండింగ్ వార్తలు