మానవత్వానికి శత్రువులు : తబ్లిగి జమాత్ సభ్యులపై సీఎం యోగి సీరియస్

  • Published By: madhu ,Published On : April 3, 2020 / 11:35 AM IST
మానవత్వానికి శత్రువులు : తబ్లిగి జమాత్ సభ్యులపై సీఎం యోగి సీరియస్

Updated On : April 3, 2020 / 11:35 AM IST

తబ్లిగి జమాత్ సభ్యుల ప్రవర్తనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా సీరియస్ అయ్యారు. మానవత్వానికి శత్రువులంటూ విరుచుకపడ్డారు. వీరిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారు చట్టానికి బద్ధులు కాలేరు..మానవత్వానికి వ్యతిరేకులు కాబట్టే చట్టాన్ని గౌరవించరని విమర్శించారు. నర్సులతో అలా ప్రవర్తించడం క్రూరమని, అందుకే కేసులు నమోదు చేస్తున్నామన్నారు. వారిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. 

ఆసుపత్రుల్లో ఉంటున్న ఆరుగురు..నర్సులతో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుడదని స్పష్టం చేశారాయన. ఘజియాబాద్ MMG ఆసుపత్రిలో తబ్లిగి సభ్యులు ఉంటున్నారు. అయితే వీరు అక్కడున్న నర్సులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, ఐసోలేషన్ వార్డులో బట్టలు లేకుండానే తిరిగారని ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదులో తెలిపారు. 

ఢిల్లీలో ప్రధాన కార్యాలయమైన మార్కాజ్ నిజాముద్దీన్ లో గత నెలలో జరిగిన మతపరమైన సమావేశానికి 136 మంది హాజరైనట్లు అధికారులు గుర్తించారు. ఆరుగురికి కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. వీరిని మార్చి 31న MMG ఆసుపత్రిలో చేరిపించారు. 
 

Also Read | మెడికల్ స్టాఫ్‌తో పాటు 50కి పైగా డాక్టర్లకు కరోనా పాజిటివ్