ప్రేమను నిరాకరించిందని..ప్రియురాలిని కసితీర కత్తితో పొడిచాడు

  • Published By: madhu ,Published On : July 19, 2020 / 08:41 AM IST
ప్రేమను నిరాకరించిందని..ప్రియురాలిని కసితీర కత్తితో పొడిచాడు

Updated On : July 19, 2020 / 9:11 AM IST

తనను ప్రేమంచడం లేదని, ప్రేమను వ్యతిరేకిస్తోందని ప్రియురాలిని కత్తితో కసితీరా పొడిచాడు. అడ్డుగా వచ్చిన తండ్రిని సైతం వదల్లేదు ఆ ప్రేమోన్మాది. అతడిపై కూడా దాడి చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న ఆ యువతిని ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ విషాద ఘటన చెన్నై నగరంలో చోటు చేసుకుంది.

కోయంబత్తూరులో పేరూర్ MR Garden కు చెందిన శక్తివేల్ కుమార్తె ఐశ్వర్య (18) పేరూర్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతోంది. రితీష్ అనే వ్యక్తి ఆమెను ప్రేమించడం మొదలు పెట్టాడు. అయితే…కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ తో ఆమెను కలువలేకపోయాడు.

ప్రియురాలిని చూడలేని పరిస్థితి ఉండడంతో రితీష్ మనోవేదనకు గురయ్యాడు. ఓ రోజు సాహసం చేశాడు. నేరుగా ప్రియురాలు ఉండే ఇంటికి వెళ్లాడు. ఇది చూసిన ఐశ్వర్య కుటుంబసభ్యులు తీవ్రంగా మందలించారు.

పలుమార్లు ఐశ్వర్యతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ దీనిని ఆమె పట్టించుకోలేదు. ప్రేమను నిరాకరించడం మొదలుపెట్టింది. దీనిని తట్టుకోలేకపోయాడు. 2020, జులై 17వ తేదీ శనివారం రాత్రి ఐశ్వర్య ఇంటికి వెళ్లాడు. ప్రేమిస్తున్నావా ? లేదా ? అని ప్రశ్నించాడు. తప్పించుకొనేందుకు ఆమె ప్రయత్నించింది.

దీంతో అప్పటికే తెచ్చుకున్న కత్తితో ఐశ్వర్యను ఇష్టమొచ్చినట్లు పొడిచేశాడు. అదే సమయంలో ఐశ్వర్య తండ్రి శక్తి వేల్ అడ్డుకొనేందుకు ప్రయత్నించాడు. అతడిపై కూడా దాడి చేసి పరార్ అయ్యాడు.

రక్తపు మడుగులో ఉన్న తండ్రి, కుమార్తెలను ఆసుపత్రికి తరలించారు. కోయంబత్తూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..2020, జులై 18వ తేదీ శనివారం ఐశ్వర్య చనిపోయింది. కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని…పరారీలో ఉన్న ప్రేమోన్మాది కోసం గాలిస్తున్నారు.