kolkata : కోల్‌కతా వరుడిని పెళ్లాడటానికి భారత్ చేరుకున్న పాకిస్తాన్ వధువు

పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ ప్రేమ కథ దాని తరువాత జరిగిన పరిణామాలు మరువక ముందే.. మరో పాకిస్తానీ యువతి ఇండియాకి వచ్చింది. వెస్ట్ బెంగాల్‌కి చెందిన ప్రియుడిని పెళ్లాడటానికి వచ్చిన ఆ యువతి ఎవరు?

kolkata : కోల్‌కతా వరుడిని పెళ్లాడటానికి భారత్ చేరుకున్న పాకిస్తాన్ వధువు

kolkata

Updated On : December 5, 2023 / 6:43 PM IST

kolkata : ఈ ఏడాది ప్రారంభంలో ప్రేమించిన వాడి కోసం పాకిస్తాన్ నుండి భారత్‌లోకి అక్రమంగా చొరబడ్డ సీమా హైదర్ ప్రేమ కథ మరువక ముందే.. మరో ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్‌కి చెందిన మరో యువతి కోల్‌కతాలో ఉన్న ప్రియుడిని పెళ్లాడేందుకు భారత్‌లో అడుగుపెట్టింది.

Shaheen Afridi : ఆ కార‌ణం చేత‌నే బ్యాగులు మోశాం.. లేదంటేనా..? : పాకిస్తాన్ పేస‌ర్ షాహీన్ అఫ్రిది

పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ ప్రేమ కథ ఆ తరువాత జరిగిన పరిణామాలు విన్నాం. ఇంకా ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి.తన భర్త సచిన్ మీనాతో గ్రేటర్ నోయిడాలో ఉంటోంది. అదలా ఉంటే.. మరో ప్రేమకథ వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్‌లోని కోల్ కతా నివాసి సమీర్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి 21 ఏళ్ల పాకిస్తాన్ యువతి  జవేరియా ఖానుమ్ భారత్‌కు చేరుకుంది. ఈ యువతికి అట్టారీ సరిహద్దులో సమీర్, అతని తండ్రి అహ్మద్ కమల్ ఖాన్ యూసఫ్‌జౌ స్వాగతం పలికారు. గతంలో రెండుసార్లు ఆమె వీసాను తిరస్కరించిన భారత్ ఆమెకు 45 రోజుల వీసాను మంజూరు చేసింది.

NASA: ఢిల్లీ మాత్రమే కాదు.. పాకిస్తాన్, బంగ్లా సహా ఇండియా మొత్తం విషపూరితమే

2018 లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఒకరినొకరు కలవడానికి ఐదారేళ్లుగా ఎదురుచూస్తున్నారు. తన తల్లి ఫోన్ లో ఉన్న జవేరియా ఫోటో చూసి ప్రేమలో పడ్డానని సమీర్ చెబుతున్నాడు. కరాచీలో ఉండే సచిన్ తల్లి బంధువు అజ్మత్ ఇస్మాయిల్ ఖాన్ కుమార్తె జవేరియా అని తెలుస్తోంది. భారత్‌కు వచ్చినందుకు సంతోషంగా ఉందని వీసా మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పింది జవేరియా.