Cricket Ball: ట్యాంకులో పడిన బాల్ తీయబోయి ఇద్దరు యువకులు..

క్రికెట్ బాల్ పడిందని డ్రైనేజి ట్యాంకులో దిగిన ఇద్దరు యువకులు చనిపోయారు. నోయిడాలో జరిగిన ఈ ఘటనలో నలుగురిలో ఇద్దరు బయటపడినట్లు తెలిసింది.

Cricket Ball: ట్యాంకులో పడిన బాల్ తీయబోయి ఇద్దరు యువకులు..

Cricket Ball (1)

Updated On : July 25, 2021 / 5:09 PM IST

Cricket Ball: క్రికెట్ బాల్ పడిందని డ్రైనేజి ట్యాంకులో దిగిన ఇద్దరు యువకులు చనిపోయారు. నోయిడాలో జరిగిన ఈ ఘటనలో నలుగురిలో ఇద్దరు బయటపడినట్లు తెలిసింది. అక్కడే స్పాట్ లో ఉన్న జల్ నిగమ్ ఆపరేటర్ బల్ రామ్ సింగ్.. ట్యాంకులోకి దిగి ఇద్దరిని మాత్రమే కాపాడగలిగాడు.

అందులోకి దిగగానే గాఢమైన వాసనకు స్పృహ కోల్పోయారు. వారందరినీ ఒక్కొక్కరిగా పైకి తీసుకురాగా.. స్థానికులు, పోలీసులు సమక్షంలో ప్రథమ చికిత్స చేసి హాస్పిటల్ కు తరలించారు. సందీప్ (22), విశాల్ కుమార్ శ్రీవాస్తవ (27) చనిపోయినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. మిగిలిన ఇద్దరినీ సప్దర్ జంగ్ హాస్పిటల్ కు రిఫర్ చేశారు.