Kerala Zika Virus : కేరళలో 19కి చేరిన జికా వైరస్ కేసులు
కేరళలో జికా వైరస్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా మరోక కేసు బయట పడింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19 కి చేరింది.

Zika Virus Cases In Kerala
Kerala Zika Virus : కేరళలో జికా వైరస్ కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా మరోక కేసు బయట పడింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19 కి చేరింది. అనారోగ్యంతో కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 73 ఏళ్ల వృద్ధురాలికి జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
ఆమె నుంచి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించగా జికా వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ విలేకరులకు తెలిపారు. తిరువనంతపురం, త్రిస్సూర్ మరియు కోజికోడ్ మెడికల్ కాలేజీలలో మరియు అలప్పుజలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) యూనిట్లో పరీక్షా సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.