PM Modi : నా 25 ఎకరాల భూమిని మోదీకి రాసిస్తా.. 100 ఏళ్ల బామ్మ ప్రకటన

ప్రధాని నరేంద్ర మోదీ నా కుమారుడు అంటున్నారు ఓ మహిళ. మధ్యప్రదేశలో మోదీ పర్యటించనున్న క్రమంలో 100 మహిళ తన 25 ఎకరాల భూమిని మోదీకి రాసిచ్చేస్తాను అనటం ఆసక్తికరంగా మారింది.

PM Modi : నా 25 ఎకరాల భూమిని మోదీకి రాసిస్తా.. 100 ఏళ్ల బామ్మ ప్రకటన

PM narendra modi.. Mangibai Tanwar

PM narendra modi.. Mangibai Tanwar : ఆమె పేరు మంగీబాయి తన్వర్ ( Mangibai Tanwar). వయస్సు 100ఏళ్లు (100 Years Old). మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh) రాజ్‌గఢ్ జిల్లా (Rajgarh District)హరిపుర గ్రామం (Haripura Village)లో నివసిస్తుంటారు.ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ (PM narendra modi)అంటే చాలా ఇష్టం. ఎందుకు అని అడిగితే మోదీ దేశానికి ఎంతో సేవ చేస్తున్నారు..తనలాంటి వృద్ధులకు ఎన్నో అవసరాలు తీరుస్తున్నారు అందుకే ఆయనంటే చాలా ఇష్టమని చెబుతోంది. అంతేకాదు తనకు 25 ఎకరాల భూమి ఉందని ఆ భూమిని మోదీకి రాసి ఇచ్చేస్తానని చెబుతోంది.

మంగీబాయికి పిల్లలు లేరా?అంటే ఉన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 14మంది సంతానం ఆమెకు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ నా 15వ కుమారుడిగా భావిస్తున్నానని దేశానికి ఎంతో సేవ చేస్తున్న ఆయనకు ఏమిచ్చినా ఎంతిచ్చినా తక్కువేనంటున్నారు మంగీబాయి. మోదీ తన 25 ఎకరాల భూమిని రాసిచ్చేస్తానని ప్రకటించారు.100 ఏళ్ల వయస్సులో ఉన్న మంగీబాయి మోదీకి 25 ఎకరాలు రాసిస్తానని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

US condemned Harassment of Journalists : జర్నలిస్టుపై వేధింపులను ఖండించిన వైట్‌హౌస్

మంగీబాయిని 100 ఏళ్ల వయస్సులో ఉన్న మీరు మోదీని గుర్తించగలరా? అని అడిగితే ఎందుకు గుర్తించలేను..అంటూ ఇదిగో ఈయనే మోదీ టీవీలో చాలాసార్లు చూశాను అని చెబుతోందామె. మోదీ నాకు ఇల్లు ఇచ్చారు. వైద్యం అందిస్తున్నారు..వితంతపు పింఛన్ ఇస్తున్నారు వేళకు ఇంత తినేలా చేస్తున్నారు అంటూ ప్రశంసలతో ముంచెత్తారు ఆమె. మోదీ ఇన్ని ఇవ్వటం వల్లే తను డబ్బులు జమ చేసుకుని తీర్థయాత్రలు వెళ్లగలిగానని చెబుతున్నారు.

కాగా మంగళవారం (జూన్ 27,2023)న ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi)మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో పర్యటించనున్నారు. ఇదే సమయంలో మంగీబాయి వీడియో వైరల్ కావటం గమనించాల్సిన విషయం. అవకాశం ఉంటే మోదీని స్వయంగా కలుస్తానని మంగీబాయి చెప్పటం మరో విశేషం. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు (madhya pradesh assembly election 2023)జరగనున్న క్రమంలో తన ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించటానికి మోడీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. భోపాల్ రోడ్‌షోలో పాల్గొని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారని సమాచారం.

Vande Bharat Trains: పట్టాలెక్కనున్న మరో ఐదు వందేభారత్ రైళ్లు.. ఏకకాలంలో ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ