Anand Mahindra : వారెవ్వా..! మెసలి నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్న జింక
జింకను లటుక్కుని పట్టేసుకుందామనుకుంది మొసలి. కానీ జింక తనకు ఏదో ప్రమాదం ముంచుకొస్తోందని కనిపెట్టటం చెంగుమంటూ ఓ దూకు దూకేయటంతో తప్పించుకున్న వీడియోను చూస్తే వెంట్రుకవాసిలో ప్రాణాలు దక్కటం అంటే ఇదేనేమోఅనిపిస్తుంది.

crocodile attacking deer
Anand Mahindra : ప్రముఖు వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) తాజాగా మరో వీడియో షేర్ చేశారు. నీళ్లు తాగటానికి వచ్చే జంతువులపై నిఘా వేసి అదును చూసి అమాంతం పట్టేద్దామనుకున్న మొసలి బారి నుంచి ఓ జింక వెంట్రుక వాసిలో తప్పించుకున్నవీడియోను షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. ఈ వీడియోను పోస్ట్ చేస్తే ఏకాగ్రత ఎంతటి కీలకమో సూచించారు.
12 సెకండ్ల వ్యవధి కలిగిన ఈ వీడియోలో జింక నీరు తాగుతుండగా అనూహ్యంగా దానిపై మొసలి దాడి చేయటానికి యత్నించింది. కానీ జింక దాన్ని పసిగట్టటం..ఒక్క గెంతుతో మొసలి నోటినుంచి తప్పించుకోవటం అంతా కనురెప్పపాటులో జరిగిపోయింది. స్లోమోషన్ లో స్పష్టంగా కనిపిస్తుంది.
మొసలిని పసిగట్టిన జింక ఒక్క ఉదుటన వెనుకకు జంప్ చేయడంతో కనురెప్పాటులో బతికిపోయింది. దీంతో మొసలి నిరాశగా తిరిగి నీళ్లల్లోకి జారి పోయింది. మరో జంతువు రాకపోతుందా? నా నోటికి చిక్కపోతుందా? అని దాని ఆశ..
ఆనంద్ మహీంద్ర ఈ వీడియోను నెట్టింట షేర్ చేసిన వెంటనే పెద్దసంఖ్యలో లైక్స్ రాబట్టడంతో పాటు రీట్వీట్స్ చేశారు. ఒత్తిళ్లను, సవాళ్లను అధిగమించేందుకు మనం నిరంతరం స్ప్రహలో ఉంటూ చురుకుగా వ్యవహరించాలని ఓ యూజర్ కామెంట్ చేయగా..ఇటువంటి వీడియోలు స్ఫూర్తిని కలిగిస్తాయని కామెంట్ చేశారు. మరి మీరు కూడా ఓ లుక్కేయండీ ఈ వీడియోపై
Reflexes. Keep them sharp. Mindfulness is a great virtue when starting the week. ? #MondayMotivation . pic.twitter.com/bZocQwThIM
— anand mahindra (@anandmahindra) June 5, 2023