Marriage Bureau : ఈ మ్యారేజీ బ్యూరో రూటే సపరేటు.. ఒక్క ఫోన్ కాల్‌తో మీ జీవిత భాగస్వామిని వెతికి పెడతాం..!

బ్యాచిలర్స్ బంపర్ లాటరీని గెలుచుకున్నారు.. పెళ్లి చేసుకునే మంచి ఛాన్స్ కోసం త్వరగా కాల్ చేయండి. అంటూ ఒక యూజర్ పోస్టు చేయగా.. ఇదంతా ఫేక్ అని, పెళ్లి పేరుతో ఆడపిల్లల పేరుతో మోసాలు చేస్తున్నారని మరో యూజర్ పోస్టు చేశాడు

Marriage Bureau : ఈ మ్యారేజీ బ్యూరో రూటే సపరేటు.. ఒక్క ఫోన్ కాల్‌తో మీ జీవిత భాగస్వామిని వెతికి పెడతాం..!

Bhopal Marriage Bureau Claims One-Call Matchmaking, Raising Eyebrows

Updated On : March 30, 2024 / 6:07 PM IST

Bhopal Marriage Bureau : పెళ్లికాని ప్రసాదులకు గుడ్ న్యూస్… భూపాల్‌కు చెందిన మ్యారేజీ బ్యూరో అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఒక్క ఫోన్ కాల్‌తో సంబంధం కుదుర్చుతామని హామీ ఇస్తోంది. భారత్‌‌లో మ్యారేజ్ బ్యూరోలకు కొదవే లేదు. అడగాలే కానీ, కోరుకున్న సంబంధాన్ని క్షణాల్లో వెతికిపెట్టేస్తాయి. ఇప్పుడు చాలామంది వివాహం చేసుకునేందుకు మ్యారేజ్ బ్యూరోలను ఆశ్రయిస్తున్నారు.

Read Also : ఎయిర్‌పోర్ట్‌లో ఈ అమ్మాయి ఎలాంటి రీల్స్ తీసుకుందో చూడండి.. లక్షల్లో ఫైన్ వేయాలని డిమాండ్

కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవచ్చునని ఆశపడుతుంటారు. అయితే, ఇందులో వివాహం అనగానే చాలామందికి అనేక సంప్రదాయాలు, సంస్కృతులు, అనేక కుటుంబ నేపథ్యాలను చూస్తుంటారు. మ్యాచ్ మేకర్లు కూడా సాంప్రదాయ మార్గాన్ని ఇష్టపడే కుటుంబాలను సూచిస్తుంటారు. మతం, కులం, విద్య, వృత్తి ఆధారంగా మ్యాచ్‌లను బ్యూరోలు ఫిల్టర్ చేస్తాయి. ప్రత్యేకించి కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన వివాహాలను కోరుకునే వారికి బ్యూరోలు పెద్దపీట వేస్తుంటాయి.

మిత్రమా.. ఇది నీకోసమే.. ప్రకటన వైరల్ :
సాధారణంగా ఈ మొత్తం ప్రక్రియ పూర్తి చేయడానికి మ్యారేజీ బ్యూరోలకు కొంత సమయం పడుతుంది. కానీ, భోపాల్‌కు చెందిన మ్యారేజ్ బ్యూరో హంసతి సమాజ్ కళ్యాణ్ సమితికి మాత్రం అంత సమయం పట్టదట. బ్యాచిలర్స్ కోసం క్షణాల్లో సంబంధాన్ని చూసిపెడుతోంది. కేవలం ఒక ఫోన్ కాల్‌లో జీవిత భాగస్వాములను వెతికిపెడతామని ఒక ప్రకటన కూడా చేసింది. కులం, మతం లేదా వైవాహిక స్థితితో సంబంధం లేకుండా అందరికి సేవలందించడమే లక్ష్యమని బ్యూరో చెబుతోంది.

మిత్రమా, ఇది నీ కోసమే.. అనే క్యాప్షన్‌తో జే మాతాడి డీజే సౌండ్ ద్వారా ప్రకటనకు సంబంధించిన ఫొటో ఇన్‌‌స్టా పేజీలో షేర్ చేసింది. ఇప్పుడా ఆ ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ మ్యారేజీ బ్యూరో ప్రకటన గురించే ఆన్‌లైన్‌లో పెద్ద చర్చ నడుస్తోంది. దీన్ని చూసిన నెటిజన్లు ఈ ప్రకటన ఫేక్ అంటూ పోస్టులు పెడుతుండగా.. మరికొందరు మాత్రం ఆసక్తిని కనబరుస్తున్నారు.

ప్రకటనపై నెటిజన్ల భిన్నాభిప్రాయాలు :
బ్యూరో ప్రకటనకు ఇప్పటివరకూ 40వేలకు పైగా లైక్‌లు రాగా, వేలాది కామెంట్లు వచ్చాయి. కొంతమంది నెటిజన్లు.. బ్యాచిలర్స్ బంపర్ లాటరీని గెలుచుకున్నారు.. పెళ్లి చేసుకునే మంచి ఛాన్స్ కోసం త్వరగా కాల్ చేయండి. అంటూ ఒక యూజర్ పోస్టు చేయగా.. ఇదంతా ఫేక్ అని, పెళ్లి పేరుతో ఆడపిల్లల పేరుతో మోసాలు చేస్తున్నారు.

ఏ సోదరుడూ వీరి ఉచ్చులోకి పడకూడదు’ అని మరో యూజర్ కామెంట్ చేశారు. ఇంతకీ ఈ బ్యూరో ఎన్ని పెళ్లిళ్లు కుదిర్చింది. వారి ఊరు, పేరు, ఫోన్ నంబర్ చెప్పాలి, అప్పుడు అది ఎంతవరకు నిజమో చెక్ చేస్తాం. నేనే కాదు.. నా స్నేహితులందరూ మీకు కాల్ చేస్తారు’ అని మరో యూజర్ పోస్టు పెట్టారు.

Read Also : Video: స్కీ రిసార్ట్‌లో గాల్లో ఊగిపోయిన చైర్‌లిఫ్ట్స్.. అందులోని ప్రయాణికులకు భయానక అనుభవం