Studets Talent : క్లాస్‌రూమ్‌లో డెస్క్ మీద డ్రమ్స్ ఇరగదీసిన కుర్రాళ్లు,ఫ్యూచర్ ర్యాక్ బ్యాండ్ వీళ్లేనేమో

పిల్లల్లో ఉండే టాలెంట్ క్లాసు రూముల్లో కనిపిస్తుంది అనటానికి ఈ వీడియో ఓ ఉదాహరణ. క్లాసు రూముకు టీచర్ రావటం కాస్త ఆలస్యమైతే చాలు పిల్లల్లో ఉండే టాలెంట్ ఇలా కనిపిస్తుంది. మరి ఆ టాలెంట్ ఏంటో మీరూ చూసేయండి..

Studets Talent : క్లాస్‌రూమ్‌లో డెస్క్ మీద డ్రమ్స్ ఇరగదీసిన కుర్రాళ్లు,ఫ్యూచర్ ర్యాక్ బ్యాండ్ వీళ్లేనేమో

Studets played mass music class room desk

Boys Studets Talent In class room desk : ఈ కుర్రాళ్ల టాలెంట్ మామూలుగా లేదు. వీళ్ల లాలెంట్ చూస్తే ఫ్యూచర్ ర్యాక్ బ్యాండ్ వీళ్లేనేమో అనిపిస్తోంది. క్లాస్ రూములో డెస్క్ మీద నలుగురు కుర్నాళ్లు డ్రమ్స్ ఇరగదీసిన వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. వీల్లను చూస్తే చిన్నప్పుడు క్లాసు రూములోకి టీచర్ రావటం లేట్ అయితే ఏదోక కోతి పనులు చేసిన తీపి గుర్తులు కళ్లముందు కదలాడతాయి. అంతేకాదు డెస్క్ ల మీద దరువులు వేస్తు ఎంజాయ్ చేసిన తీప్పి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. కానీ ఈ నలుగురు కుర్రాళ్లు మాత్రం డెస్క్ మీద ఇరదీసిన మ్యూజిక్ వింటే వావ్ ఫ్యూచర్ ర్యాక్ బ్యాండ్ వీళ్లే అని కచ్చితంగా అనిపిస్తుంది.

నలుగురు కుర్రాళ్లు క్లాస్ రూములో డెస్క్ మీద కొట్టిన దరువు భలే ముచ్చటగా ఉంది. ఒక కుర్రాడు ఆ డెస్క్ ముందు కూర్చుని ఉంటే మిగతావారు డెస్క్‌నే డ్రమ్స్ లాగా తెగ వాయించిపారేశారు. ఒట్టి చేతులతో చక్కటి రిథమ్ తో అద్భుతంగా మాస్ బీట్ (Mass beat) కొట్టారు. వీళ్లను చూస్తుంటే ఓ మ్యూజిక్ బ్యాండ్ గుర్తుకొస్తోంది. ఈ నలుగురు కుర్రాళ్ల టాలెంట్ ను నెటిజన్ల ప్రశంసిస్తున్నారు.ఈ వీడియోను దాదాపు కోటి మందికి పైగా వీక్షించగా..లక్షలాదిమంది లైక్ చేశారు. ఫ్యూచర్ గ్రేట్ ర్యాక్ బ్యాండ్ వంటి ఎన్నో కామెంట్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. సోషల్ మీడియా ఎంతోమంది మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తెస్తోంది. అటువంటిదే ఈ వీడియో కూడా మరి మీరు కూడా ఈ కుర్రాళ్ల మాస్ టాలెంట్ పై ఓ లుక్కేయండీ..

 

View this post on Instagram

 

A post shared by Irc Lal Linsith (@irc_lal_linsith)