Woman Love with Phone Thief : తన ఫోన్ చోరీ చేసిన దొంగతో యువతి ప్రేమాయణం .. వీరి లవ్వు స్టోరీ మామూలుగా లేదుగా..

తన ఫోన్ దొంగిలించి దొంగతో ప్రేమలో పండింది ఓ అమ్మాయి. ఆ దొంగే తన ప్రపంచం అంటోంది. అతనితోనే కలిసి జీవిస్తోంది. నా ఫోన్ తో పాటు నా మనస్సును కూడా దొంగిలించాడంటూ తెగ మురిసిపోతోంది.

Woman Love with Phone Thief : తన ఫోన్ చోరీ చేసిన దొంగతో యువతి ప్రేమాయణం .. వీరి లవ్వు స్టోరీ మామూలుగా లేదుగా..

woman's love with phone thief

Brazil woman love with phone thief : మనం రోడ్డుమీద నడుచుకుంటు వెళుతున్నప్పుడో..లేదా బస్సు,రైళ్లలో ప్రయాణించే సమయంలో ఎవరైనా మన ఫోన్ కొట్టేశారనుకోండీ అదేనండీ దొంగిలించారనుకోండి..ఏం చేస్తాం…? అది కాస్ట్లీ ఫోన్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం..లేదా ఆ దొంగను వెంబడించి పట్టుకుని చితక్కొట్టి పోలీసులకు అప్పగిస్తాం. ఈ రెండుకాకపోతే పోతే పోయింది ఏం చేస్తాంలే అని సరిపెట్టుకుంటాం..ఇంకో ఫోన్ కొనుక్కుంటాం. కానీ ఓ మహిళ మాత్రం తన ఫోన్ చోరీ చేసిన దొంగతో పరిచయం పెంచుకుంది. ప్రేమలో పడింది. అక్కడితో ఊరుకుందా అంటే అదీ లేదు..ఏకంగా అతనితో సహజీవనం చేస్తోంది. రెండేళ్లుగా ఆ ఫోన్ దొంగతో సహజీవనం చేస్తోంది. అలా ఆ జంటను ఓ మీడియా ఇంటర్వ్యూ చేయటంతో వారుకాస్తా ఫుల్ ఫేమస్ అయిపోయారు. ఫోన్ దొంగతో ప్రేమ..విశేషాలను మీడియాతో షేర్ చేసుకున్నారా జంట..

బ్రెజిల్ లో జరిగిన ఈ వింత ప్రేమ గురించి బ్రెజిలియన్ జర్నలిస్ట్ మిల్టన్ నెవెస్ ఇంటర్వ్యూ చేశారు. ఈ వీడియోను మిల్టన్ జులై 21న ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనికి 2,30,000 వ్యూస్ వచ్చాయి. మరి ఆ ఫోన్ దొంగ ప్రేమ కథలో హీరోయిన్ పేరు ఇమాన్యులా. ఆమె ఫోన్ తో పాటు ఆమె మనస్సును కూడా దొంగిలించిన ఆ కథానాయకుడు తమ ప్రేమ కథ విశేషాలను మాంచి జోష్ గా చెప్పుకొచ్చాడు.

T-Shirt : టీ షర్టుకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా..? ‘టీ’ అంటే ఏమిటీ

తన ప్రేమ గురించి అమ్మాన్యులా వివరిస్తు..నేను ఓ రోజు వీధిలో నడిచి వెళుతుండగా నా ఫోన్ ను ఓ వ్యక్తి దొంగిలించాడు. నా ఫోన్ నంబర్ ను నేను వేరే ఫోన్ లో సేవ్ చేసుకున్నాను. దీంతో ఆ నంబర్ కు ఆ ఫోన్ నుంచి కాల్ చేశాను. రింగ్ అయింది కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కానీ కాసేపటికి ఆ నెం. నుంచి నాకు కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి ఈ ఫోన్ కొట్టేసింది నేనే అని చెప్పాడు. ఎవరైనా అయితే అలా చెప్పరు. కానీ అతను నిజాయితీగా ఈ ఫోన్ కొట్టేసింది నేను అనే చెప్పాడు. అతని నిజాయితీ నాకు బాగా నచ్చింది. అందుకే అతనితో మాట్లాడాను..ఆ మాటల్లో నాకు బాధ కనిపించింది. అలా అతని మాటలకు నేను ఆకర్షితురాలినయ్యాను అంటూ చెప్పుకొచ్చింది..

ఇకపోతే ఫోన్ దొంగ మాట్లాడుతు..నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు. ఒంటరిగా ఉండడం ఎంతో బాధగా ఉండేది. నేను ఫోన్‌ కొట్టేశాక.. అందులో ఆమె ఫోటోను చూశాను. ‘ఎంత అందంగా ఉందీ అనుకున్నాను. అందుకే తిరిగి ఫోన్ చేశాను..ఆమెను ప్రతిరోజూ చూస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాను. ఆమె ఫోన్ కొట్టేసినందుకు చాలా ఫీల్ అయ్యాను..’ అంటూ చెప్పుకొచ్చాడు.

అలా వారిద్దరు తరచు మాట్లాడుకునేవారు. ఆ తరువాత కలుసుకున్నారు. ఎన్నో మాటలు మాట్లాడుకునేవారు. అలా ఇద్దరు మధ్యా స్నేహం పెరిగింది. అదికాస్తా ప్రేమగా మారింది. అలా ఇద్దరు కలిసి ఉండటం ప్రారంభించారు. అలా ఇమాన్యులా, ఆమె దొంగ ప్రియుడు రెండు సంవత్సరాలుగా కలిసిఉంటున్నారు. సహజీవనం చేస్తున్నారు.