Uber Charged : ఓరి నాయనో..! సింగిల్ రైడ్‌కే రూ. 24 లక్షలు చార్జ్ .. ఇది ఉబరా? లేక విమానమా..?
మీరు ఉబర్ ట్యాక్సీ బుక్ చేసుకున్నారా? అయితే జాగ్రత్త..మీ బ్యాంక్ ఎమైంట్ ఖాళీ అయిపోవచ్చు..ఇదిగో ఈ జంటకు జరిగిందే మీకు జరగొచ్చు..

Uber Shockingly Charged US couple Costa Rica
Uber Charged : సెంట్రల్ అమెరికా ( Central America) లోని గ్వాటెమాలా(Guatemala City)కు చెందిన డగ్లస్ ఆర్డోనెజ్ (Douglas Ordonez), డొమినిక్ ఆడమ్స్ (Dominique Adams)అనే దంపతులు తమ ఐదవ పెళ్లి రోజు (five year anniversary)సందర్భంగా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకున్నారు. దాని కోసం వారు ట్రిప్ ప్లాన్ చేసుకుని కోస్టారికా (Costa Rica) వెళ్లారు. అక్కడ ఒక ఉబర్ టాక్సీని బుక్ చేసుకున్నారు. అక్కడివరకు బాగానే ఉంది. ఆ తర్వాతే టూర్ అంతా అప్ సెట్ అయ్యే ట్విస్ట్ చోటుచేసుకుంది. వారి ఎకౌంట్ లోంచి 29,994 డాలర్లుఅంటే భారత కరెన్సీలో రూ.24 లక్షలు.. కట్ అయ్యాయి. ఉబర్ అకౌంట్(Uber account)కు క్రెడిట్ కార్డు లింక్ (Credit card link)చేసి ఉండటంతో ఆటోమెటిక్ పేమెంట్ (Automatic payment)అయింది.
ఆ విషయం వారికి వెంటనేతెలియలేదు. తర్వాత వారు ఓ హోటల్‌కు వెళ్లి వారికి ఇష్టమైన భోజనం చేశారు. బిల్లు కట్టటానికి యథా మామూలుగానే క్రెడిట్ కార్డు (Credit card)వాడారు. కానీ అది పనిచేయలేదు. ఎందుకంటే దాంట్లో బ్యాలన్స్ తగినంతగా లేదు. లక్షల రూపాయల లిమిట్ అయిపోయి.. నెగటివ్ బ్యాలెన్స్ (negative balance) చూపెట్టింది. దీంతో వారు షాక్ అయ్యారు. ఎందుకంటే వారు ఉపయోగించిన క్రెడిట్ కార్డులో ఉన్న డబ్బులన్నీ ఉబర్ సంస్థ కు కట్ అయ్యాయి. దీంతో వారు షాక్ అయ్యారు. సింగిల్ రైడ్ కే ఇంత ఎమౌంట్ ? అని ఆశ్చర్యపోయారు. 29,994 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 24 లక్షలను కట్ చేసింది. దీంతో వారు ఉబర్ (Uber) సంస్థకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుపై స్పందించిన ఉబర్ సంస్థ..తగిన కారణాన్ని తెలుసుకుంది. కరెన్సీ కన్వర్షన్ లో ఏర్పడిన టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఇలా జరిగిందని గుర్తించింది. అందుకే అంత బిల్లు వచ్చిందని తెలుసుకుని సదరు జంటకు క్షమాపణ చెప్పింది. ఇంతకీ జరిగిందేమంటే..ఆ జంట ప్రయాణించిన కొద్దిపాటి దూరానికి ఉబర్ ట్యాక్సీ బిల్లు 55 డాలర్లు అదే భారత కరెన్సీలో రూ. 4500 బిల్లు. కానీ ఉబర్ (Uber)సంస్థ టెక్నికల్ ఎర్రర్ తో వచ్చిన సమస్యతో రూ.24 లక్షలుగా చూపించింది. ఇక్కడ మరో విషయం ఏమంటే..వారు కట్టాల్సిన బిల్లు కోస్టారికా కోలన్స్ లో కాకుండా ఏకంగా అమెరికా డాలర్లలో కట్ అయ్యింది. అందుకే అంత భారీ ఎమౌంట్ కట్ అయ్యింది. ఈ పొరపాటును ఉబర్ గుర్తించింది. వివాహ దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవటానికి వచ్చిన జంటకు ఉబర్ సంస్థ క్షమాపణలు చెప్పింది. దీంతో ఉబర్ చేసిన చిన్న పొరపాటుకు తమ పెళ్లి రోజు ఇలా ఆందోళనగా గజిబిజిగా తయారై హ్యాపీనెస్ అంతా ఆవిరైపోయిందని వాపోయారు ఆ జంట.
Fake Watch : ఆపిల్ వాచ్ ఆర్డర్ ఇస్తే ఫేక్ వాచ్ డెలివరీ .. మహిళకు క్షమాపణలు చెప్పిన అమెజాన్
ఉబర్ (Uber)సంస్థ వారికి క్షమాపణలు చెప్పి ఎట్టకేలకు కట్ అయిన ఎమౌంట్ ను తిరిగి ఇచ్చింది. నాలుగు రోజుల తరువాత. తమ పెళ్లిరోజున హ్యాపీగా గడపాలనుకుంటే ఉబర్ (Uber)వల్ల తమ టూర్ అంతా వేస్ట్ అయ్యిందని డగ్లస్ ఆర్డోనెజ్ తమ అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ అయ్యింది. రూ. 24 లక్షల నుంచి రూ. 29 వేలను కట్ చేసుకుని మిగిలిన డబ్బులను తిరిగి తన అకౌంట్‌లో ఉబర్ (Uber)సంస్థ జమ చేసిందని డగ్లస్ (Douglas Ordonez) ట్విటర్ వేదికగా తెలిపారు.