T-Shirt : టీ షర్టుకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా..? ‘టీ’ అంటే ఏమిటీ

టీ షర్ట్‌లోని టీ అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా..? వేసుకోవటమే కాదు దానికి గురించి తెలీదే..అంటారా..అయితే మరి ఆ ఆసక్తికర విషయాలేంటో చూసేయండి..

T-Shirt : టీ షర్టుకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా..? ‘టీ’ అంటే ఏమిటీ

Interesting facts about T-Shirt

Interesting facts about T-Shirt : టీ షర్ట్. అంటే ఏంటీ..? చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు..యువతీయువకులు చాలా ఇష్టంగా ధరించే టీ షర్ట్ గురించి చాలా ఆసక్తికర విషయాలున్నాయి. అసలు ఈ టీ షర్ట్ అనే మాట ఎలా వచ్చింది. షర్టులో ‘టీ’అంటే ఏంటీ..అనే ఆలోచన మీకెప్పుడైనా వచ్చిందా..? కంఫర్ట్ తో పాటు ఎన్నో రంగుల్లో అందుబాటులో ఉండే టీషర్ట్ అన్ని వయస్సులవారు ధరిస్తుంటారు. మరి టీ షర్ట్‌లోని టీ అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా..? వేసుకోవటమే కాదు దానికి గురించి తెలీదే..అంటారా..అయితే మరి ఆ ఆసక్తికర విషయాలేంటో తెలుసుకుందాం రండీ..

టీ షర్టు ధరించటం చాలా చాలా ఈజీ..తలపైనుంచి ఈజీగా వేసేసుకోవచ్చు.ఐదారు బటన్స్ పెట్టుకునే పనిలేదు. ఇలా ప్యాంట్ వేసుకోవటం..అలా బుడుంగున తలపై నుంచి టీ షర్టు వేసేసుకోవటం అంతే చిటికెలో డ్రెస్సప్ కంప్లీట్..పైగా టీ షర్టులకు మామూలు షర్టుల్లా ప్రతీసారి ఐరన్ (ఇస్త్రీ) చేసుకోనక్కరలేదు. టీ షర్టులు నలిగిపోయినా అదో ఫ్యాషన్ గానే కనిపిస్తాయి. అలా ఎన్నో కంఫర్టులండే ఈ టీ షర్టులకు ఆ పేరు ఎలా వచ్చిందో చూద్దాం..

Australia : ఆస్ట్రేలియాలోను అమెరికాలాంటి ఘటనలే .. బియ్యం కోసం ఎగబడుతున్న జనాలు

T- షర్టులో T అనే పదం అర్థం రెండు విధాలుగా వచ్చిందంటారు. దాంట్లో ఓ విధానం గురించి చెప్పుకోవాలంటే..ఓ నివేదిక ప్రకారంగా చూస్తే మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికాన్ సైనికులు ట్రైనింగ్ సమయంలో కంఫర్ట్ గా..తేలిగగ్గా ఉండే బట్టలు ధరించేవారట..దీంతో ‘ట్రైనింగ్ షర్టులు అని పిలిచేవారట. అలా ట్రైనింగ్ సమయంలోనే కాకుండా మామూలుగా ధరించటానికి కూడా చక్కగా కంఫర్టుగా ఉండటంతో కొంతకాలనికి ట్రైనింగ్ డ్రెస్సులే బాగున్నాయే అనిపించేలా వాటినే ఎక్కువగా ధరించేవారట. అలా వాటిని ‘ట్రైనింగ్ షర్టు’లు అనటం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ ‘టీ2అంటే ట్రైనింగ్ అని అర్థం. శిక్షణా చొక్కాను షార్ట్‌గా T- షర్టు అని పిలిచే వారు. అలా వాటికి టీ షర్టులు అనే పేరు వచ్చింది అంటారు.

అలాగే కొంతమంది ఫ్యాషన్ డిజైనర్ల అభిప్రాయం ప్రకారం.. T- షర్టు ఆకారం T వలె ఉంటుంది. దీనిని ముందు లేదా వెనుక నుంచి చూస్తే, అది T ఆకారంలో కనిపిస్తుంది. బహుశా అందుకే దీనికి టీ-షర్ట్ అని పేరు వచ్చిందని అంటారు.ఈ రెండు సంఘటనలు లేదా కారణాలు కూడా టీ షర్టు అని పిలవడానికి సరైనవే అనిపిస్తోంది. అలాగే అమెరికా సైనికుల విషయాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేం. ప్రస్తుతం కాలంలో టీ-షర్ట్ అనేది చాలా సాధారణమైన దుస్తులుగా మారిపోయాయి. మగవారు, ఆడవారు కూడా ధరించే దుస్తుల్లో ఒకటిగా టీ షర్టులు మారిపోయాయి అంటే అతిశయోక్తి కాదు. టీ షర్ట్ గ్రాఫిక్స్, చిత్రాలు, పలు రకాల డిజైన్లతో అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు టీ షర్టుల్లో పెద్దగా రంగులుండేవికాదు.కొన్ని రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడలా కాదు చాలా చాలా రంగుల్లో అందుబాటులోకొచ్చాయి.