Bombay High Court : ‘సింగం’ లాంటి పోలీసు సినిమాలు సమాజానికి ప్రమాదం : జడ్జి కీలక వ్యాఖ్యలు

సినిమాల్లో హీరోలు పోలీసులైతే భారీ ఎలివేషన్ తో ఎంట్రీ ఇస్తాడు. ఫైటింగ్ లు చేసేస్తాడు. వందమంది రౌడీలను కూడా ఒక్కడే పొట్టుపొట్టుగా కొట్టేస్తాడు. పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తాడు. బాధితులకు న్యాయం చేసేస్తాడు. కానీ నిజ జీవితంలో అలా జరగదు. అదే విషయంపై హైకోర్టు న్యాయమూర్తి కీలయ వ్యాఖ్యలు చేశారు.

Bombay High Court : ‘సింగం’ లాంటి పోలీసు సినిమాలు సమాజానికి ప్రమాదం : జడ్జి కీలక వ్యాఖ్యలు

Bombay High Court judge Singham Films

Updated On : September 24, 2023 / 12:02 PM IST

Bombay High Court judge Singham Films : సినిమాల్లో హీరో పోలీసు అయితే కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్. ఎక్కడ అన్యాయం జరిగినా ఇట్టే వాలిపోతాడు హీరో. భారీ ఎలివేషన్ తో అన్యాయం జరిగేచోట ఎంట్రీ ఇస్తాడు. డైలాగులు సింపుల్ గా ఉన్నా భారీగా ఉన్నా కావాల్సినంత కిక్ ఇస్తు ఎలాంటి సమస్యనైనా ఇట్టే సాల్వ్ చేసేస్తాడు. హీరో అంటే మరి ఆ మాత్రం ఎలివేషన్ ఉండాలి కదా మరి. ఎందుకంటే అది సినిమా..పోలీసుల బ్యాక్ డ్రాప్ తో వచ్చే సినిమాలన్నీ దాదాపు హిట్టే. కానీ నిజ జీవితంలో అలా జరగదు. అదే విషయాన్ని గుర్తించాలని సూచిస్తు బాంబే హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

సినిమాల్లో హీరోలు పోలీసులైతే ఎలా ఉంటుందో అనే విషయం గురించి బాంబే హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘సింగం’ సినిమాను ప్రస్తావిస్తు బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గౌతమ్‌ పటేల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సింగం’లాంటి సినిమాలు ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఇండియన్‌ పోలీసు ఫౌండేషన్‌ వార్షికోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ గౌతమ్ పటేల్ మాట్లాడుతు.. న్యాయ ప్రక్రియను పట్టిచుకోకుండా వెంటనే న్యాయాన్ని అందించే ‘సింగం’ వంటి పోలీసు సినిమాలు ప్రమాదకరమని అన్నారు. ఇటువంటి సినిమాలు ప్రమాదకరమైన మెసేజ్ లను ఇస్తున్నాయని అన్నారు.

‘కోర్టులు తమ పని తాము చేయడం లేదని ప్రజలు భావించినప్పుడు.. ప్రజలు అసహనాన్ని ప్రదర్శిస్తు పోలీసుల చర్యలను స్వాగతిస్తున్నారు’ అని అన్నారు. అటువంటి చర్యలు సరైనవరి ప్రజలు భావిస్తున్నారని..జరిగిన అన్యాయానికి న్యాయం జరిగిందని ప్రజలు భావిస్తున్నారని..కానీ న్యాయం జరిగిందా..? అని ప్రశ్నించారు. ‘సింగం’లాంటి సినిమాల క్లైమాక్స్‌లో పోలీసులు విలన్‌ పాత్రగా చిత్రీకరించిన రాజకీయ నేతపై తిరగబడతారని..ఇటువంటి సన్నివేశాలతో న్యాయం జరిగినట్లు చూపించారని..కానీ అక్కడ న్యాయం జరిగిందా..? ఈ ప్రక్రియ నిదానంగా జరుగుతుందని అన్నారు.

సినిమాల్లో..న్యాయమూర్తులపై పోలీసులు విధేయులుగా, పిరికివారుగా, సోడాబుడ్డి కళ్లద్దాలు పెట్టుకున్నవారిగా..ఆరోపిస్తున్నారు. దోషులను విడిచిపెట్టే కోర్టులు. హీరో పోలీసు ఒంటరిగా న్యాయం చేసేస్తాడు అని అన్నారు. సింగం సినిమాలో మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో నటుడు ప్రకాష్ రాజ్ పోషించిన రాజకీయ నాయకుడిపై మొత్తం పోలీసు బలగాలు దిగినట్లుగా చూపించారని కానీ నేను అడుగుతున్నాను.. నిజంగా అటువంటిది జరుగుతుందా..?జస్టిస్ పటేల్ అన్నారు. అటువంటి సందేశాలు ఎంత ప్రమాదకరమైనది” అనేది ఆలోంచాలి అని సూచించారు. న్యాయ జరిగే ప్రక్రియ నెమ్మదిగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను జప్తు చేయకూడదనే ప్రధాన సూత్రంగా ఉండాలన్నారు.

రోహిత్ శెట్టి- అజయ్ దేవగన్ బృందం ఇటీవలే సింగం ఎగైన్ షూటింగ్ ను పూజాకార్య‌క్ర‌మాల‌తో లాంచ్ చేసారు. న్యాయమూర్తి ప్రకటనతో సినిమా చిక్కుల్లో పడే అవకాశం ఉందని తెలుస్తోంది. సింగం లాంటి సినిమాలు ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తాయని జస్టిస్ గౌతమ్ పటేల్ వ్యాఖ్యానించ‌డం నిర్మాత‌ల్ని ఊహించ‌ని డైల‌మాలో ప‌డేసింద‌నే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.