Deaf Lawyer Sara Sunny : సుప్రీంకోర్టులో సైగలతోనే మహిళా న్యాయవాది వాదనలు

సుప్రీంకోర్టులో మొదటిసారిగా ఓ మహిళా న్యాయవాది సైగలతో వాదనలు వినిపించారు. ఆమె వాదనలకు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ అనుమతి ఇఛ్చారు.

Deaf Lawyer Sara Sunny : సుప్రీంకోర్టులో సైగలతోనే మహిళా న్యాయవాది వాదనలు

Deaf Lawyer Sara Sunny Supreme Court

First Deaf Lawyer Sara Sunny : సుప్రీంకోర్టు(Supreme Court)లో మొదటిసారిగా చెవిటి న్యాయవాది వాదనలు వినిపించారు. తన సైగలతో ఓ కేసు విచారణలో వాదనలు వినిపించారు చెవిటి లోపం కలిగిన ఓ మహిళా న్యాయవాది(Deaf Lawyer). ఆమె పేరు సారా సన్నీ(Sara Sunny). కేరళ (Kerala)కు చెందిన సారా సన్నీ సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది సంచితా ఐన్ (Sanchita Ain)వద్ద జూనియర్ గా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టులో ఉన్న ఓ కేసుకు సంబంధించి వర్చువల్‌( virtual proceedings)గా జరిగిన విచారణలో సంచితా ఐన్‌తో కలిసి సారా సన్నీ పాల్గొన్నారు.

ఈ విచారణలో వాదోపవాదనలు సారా సన్నీకి అర్థమయ్యేలా సైన్ లాంగ్వేజ్‌లో చెప్పేందుకు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ (ఐఎస్ఎల్) వ్యాఖ్యాత సౌరవ్‌ రాయ్‌ చౌదరి(Saurabh Roy Choudhary)ని సంచితా ఐన్ నియమించారు. ఈక్రమంలో విచారణ మొదలైంది. సౌరవ్‌ రాయ్‌ చౌధురి కూడా స్క్రీన్‌పై కనిపించడంపై సుప్రీంకోర్టు మోడరేటర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ (Chief Justice of India DY Chandrachud)ను సైన్‌ లాంగ్వేజ్‌ వ్యాఖ్యాతను అనుమతించాలని సంచితా ఐన్‌ కోరారు. దానికి సీజేఐ అనుమతి ఇచ్చారు. ‘‘ఫరవాలేదు సైన్ లాంగ్వేజ్ వ్యాఖ్యాత స్క్రీన్‌లో జాయిన్ కావచ్చు” అంటూ అనుమతి ఇచ్చారు.

Anand Mahindra : యువకుడు మృతి .. ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు

దీంతో ఈ కేసు విచారణ వివరాలను సౌరవ్‌ రాయ్‌ సంజ్ఞలతో సారా సన్నీకి వివరించారు. తనకు ప్రత్యేక అవకాశాన్ని కల్పించిన సీజేఐ చంద్రచూడ్ కు సారా సన్నీ ధన్యవాదాలు తెలిపారు. ఇక తాను భవిష్యత్తులో వ్యాఖ్యాత సాయంతో వాదనలు వినిపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

వైకల్యం తమ ఎదుగుదలకు అడ్డుకాదని ఎంతోమంది నిరూపించారు. ఆటల్లోను..నటనలోను దివ్యాంగులు రాణించారు. రాణిస్తున్నారు. వైలక్యం ఉందని కృంగిపోకుండా తమదైన శైలిలో ముందుకు నడుస్తున్నారు. తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అటువంటివారిలో చెవిటి లోపం ఉన్నా న్యాయవాద వృత్తిలో ఎదగాలనుకున్నారు కేరళకు చెందిన మహిళ న్యాయవాది సారా సన్ని.