Video: వామ్మో.. ఈ పెద్ద డబ్బాలోని చాక్లెట్ క్రీమ్ అంతా తినేసి.. అక్కడితో ఆగకుండా..

ఆ తర్వాత కూడా పలు రకాల స్వీట్ ఫుడ్ ని తిన్నాడు. అంత చక్కెర శరీరంలోకి వెళ్తే అతడి ఆరోగ్యం పాడు కాదా?

Video: వామ్మో.. ఈ పెద్ద డబ్బాలోని చాక్లెట్ క్రీమ్ అంతా తినేసి.. అక్కడితో ఆగకుండా..

Updated On : April 13, 2024 / 6:16 PM IST

సోషల్ మీడియాలో కనపడే కొన్ని వీడియోలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఆహారానికి సంబంధించిన ప్రయోగాల నుంచి వైరల్ ట్రెండ్స్ వరకు అన్ని రకాల వీడియోలను సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం. ఫుడ్ తినే తీరులో ప్రత్యేకత చూపుతూ ఏఎస్ఎంఆర్ ముక్‌బాంగ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలను ఎంతగా ఊపేసిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు.

ఆ ట్రెండ్ ని ఫాలో అవుతూ కెమెరా ముందు కూర్చొని వెరైటీ ఫుడ్ తింటూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు చాలా మంది. తాజాగా ఓ కంటెంట్ క్రియేటర్ పెద్ద మొత్తంలో ఫుడ్ తిని అందరినీ ఆశ్చపర్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఓ పెద్ద నుటెల్లా జార్ లోని చాక్లెట్ అంతా తినేశాడు.

అక్కడితో ఆగకుండా నుటెల్లా జార్ ఆకారంలో తయారు చేసిన కేక్ మొత్తం తినేశాడు. ఆ తర్వాత కూడా పలు రకాల స్వీట్ ఫుడ్ ని తిన్నాడు. అంత చక్కెర శరీరంలోకి వెళ్తే అతడి ఆరోగ్యం పాడు కాదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అతడి శరీరంలో రక్తానికి బదులు చక్కెరే ఉంటుందని కొందరు సెటైర్లు వేస్తూ కామెంట్లు చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Bader Al Safar (@baderalsafar)

Also Read : హైదరాబాద్‌లో రకుల్ ఫుడ్ బిజినెస్..!